Fast Food: ఫాస్ట్ ఫుడ్ వినియోగం.. కాలేయానికి ముప్పు

Fast Food: వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. యువతను ఆకర్షించే ఔట్‌లెట్‌లు.. ఆఫీస్‌లో స్నాక్ బ్రేక్.. కాలేజీలో కబుర్లతో కాలక్షేపం చేసేది ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనే. ఇచ్చిన ఆర్డర్ వచ్చేలోపే మరో ఆర్డర్ ఇచ్చేస్తుంటారు.. రుచిగా ఉందని ఆస్వాదిస్తుంటారు కానీ ఆ తరువాత వచ్చే పరిణామాలను ఏమాత్రం పట్టించుకోరు.
ఊబకాయం, మధుమేహం ఉన్న వ్యక్తులకు ఫాస్ట్ ఫుడ్ మరీ డేంజర్.. రోజువారీ కేలరీలలో 20% లేదా అంతకంటే ఎక్కువ తినే వారి కాలేయంలో కొవ్వు స్థాయిలు తీవ్రంగా పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు. USCలోని కెక్ మెడిసిన్ క్లినికల్ అధ్యయనం ప్రకారం ప్రజలు వారి ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంది.
ఫాస్ట్ ఫుడ్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో ముడిపడి ఉందని అధ్యయనం పేర్కొంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోతే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఇది కాలేయ క్యాన్సర్‌కి కారణమవుతుంది. పరిశోధకులు సుమారు 4,000 మందిపై సర్వే నిర్వహించారు. వారి ఆహారపు అలవాట్లను పర్యవేక్షించారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 52% మంది ఫాస్ట్ ఫుడ్ వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు. "సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గత 50 సంవత్సరాలలో ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగినందున పరిశోధనలు ఆందోళనకరంగా ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com