Fenugreek Hair Spray: జుట్టు ఆరోగ్యానికి మెంతి వాటర్ స్ప్రే..

Fenugreek Hair Spray: జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మెంతి గింజలు అద్భుతమైన ఔషధం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో అనేక చర్మ మరియు జుట్టు సమస్యలకు మూలికా మందులను ఉపయోగిస్తారు.
షాంపూలు, సీరమ్‌లు, హెయిర్ ప్యాక్‌లు, నూనెలు వంటి అనేక హెర్బల్ హెయిర్ కేర్ ఉత్పత్తులు వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచుతాయి. ఇవి మీ జుట్టును బలోపేతం చేయడానికి, కండిషన్ చేయడానికి, మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు.
ఆహారంలో మెంతి కూరను తీసుకోవడం. వారానికి ఒకసారి జుట్టుకు మెంతి ఆకును గ్రైండ్ చేసి ఆ రసం అప్లై చేయడం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టుకు ఉన్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించవచ్చు. చివర్లు చిట్లిపోవడం, అధిక జుట్టు రాలడం వరకు అనేక సమస్యలను నివారించవచ్చు.
ప్రతి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లో మెంతులు తప్పని సరిగా జోడిస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకునే మెంతి హెయిర్‌స్ప్రేని గురించి తెలుసుకుందాము. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం రూపొందించబడింది.
మెంతి స్ప్రే తయారీకి కావలసినవి:
2 కప్పుల నీరు
1 స్ప్రే బాటిల్
1 కప్పు మెంతి గింజలు
స్టెప్ 1: ఒక గాజు గిన్నెలో మెంతి గింజలను వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.
దశ 2: మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి ఒక స్ప్రే బాటిల్‌లో నింపండి. గింజలను తినేయొచ్చు లేదా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించ వచ్చు.
దశ 3: స్ప్రే బాటిల్‌లో నింపిన నీటిని మీ స్కా్ల్ఫ్ మొత్తం తడిచేలా స్ప్రే చేయండి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com