Periods: పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

Periods (tv5news.in)
Periods: పీరియడ్స్ అనేవి ప్రతీ నెల వచ్చేవే అయినా.. ఒక్కొక్కసారి అది భరించలేనంత నొప్పిని కూడా ఇస్తుంది. ఈ నొప్పిని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే చాలామంది వైద్యులు ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను అందించారు. అయితే ఒక్కొక్క బాడీ ఫంక్షనింగ్‌కు తగినట్టుగా ఈ చిట్కాలు పనిచేస్తాయి. కానీ అలాంటి సమయంలో అందరు కామన్‌గా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి.
పీరియడ్స్ సమయంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అందులోనూ పాలకూర అయితే చాలా బెటర్. మామూలుగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లెవెల్స్ తగ్గి నీరసం వస్తుంది. అందుకే ఆ టైమ్‌లో పాలకూర, ఇతర ఆకుకూరలు తింటే ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి.
అల్లం ఘాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో మామూలు టీ కాకుండా అల్లం టీ తీసుకుంటే మంచిది. దీని వల్ల తలనొప్పి, డయేరియా లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి.
చాక్లెట్ అనేది పీరియడ్స్ సమయంలో తాత్కాలిక రిలీఫ్ ఇస్తుందని తెలిసిన విషయమే. అందులోనూ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నిషియం ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్‌లో కాస్త యాక్టివ్‌గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.
పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పీరియడ్స్ టైమ్‌లో కూడా నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తినడం చాలా మేలు చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com