హెల్త్ & లైఫ్ స్టైల్

Health : మంచి నిద్ర రావాలంటే ఇవి తినండి..

Health : మంచి నిద్ర రావాలంటే ఈ ఆహారాన్ని తీసుకోండి.

Health : మంచి నిద్ర రావాలంటే ఇవి తినండి..
X

Health : రోజంతో ఎన్నో పనులతో అలసిపోతాం అయినా కూడా కొన్ని సందర్భాల్లో నిద్రపట్టదు. కడుపునిండ భోజనం చసినా కూడా మనకు నిద్ర రాదు. డీప్ స్లీప్, మంచిగా నిద్ర పోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. కొందరు రాత్రి సమయంలో కాఫీ తాగుతుంటారు. కాఫీలో కెఫైన్ ఉండడం వల్ల నిద్ర దెబ్బ తింటుంది. కంటినిండా నిద్ర పోవడానికి మందులు అవసరం లేదు, ఇక్కడ ఇచ్చిన పళ్లను, ఆహారాన్ని సేవిస్తే చాలు, మంచి డీప్ స్లీప్‌లోకి వెళ్లి రిలాక్స్ అవుతారు.

నట్స్, కాజు బాదాం : ఈ నట్స్‌లో మీకు అవసరమైనన్ని పోషకాలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా నిద్ర బాగా వస్తుందని కూడా చెబుతున్నారు. నిద్రకు సహకరించే ట్రిప్టోపాన్ అనే ఆమినో యాసిడ్ కూడా ఇందులో ఉంది.

గుమ్మడి గింజలు : గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు సహకరిస్తుంది. ఇవి మధుమేహం, గుండెజబ్బులను కూడా నియంత్రిస్తుంది.

కివి పండు : నిద్ర పోవడానికి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కివి పండును తినాల్సిందే. ఇందులో ఉండే సెరొటొనిన్ బాడీలో మెలటొనిన్ పెరుగుదలకు సహకరిస్తుంది. మెలటొనన్‌కు నిద్రకు చాలా దగ్గరి సంబంధం ఉంది

టమాట : టమోటాలు తింటే నిద్ర వస్తుందా అని ఆశ్చర్యపడొచ్చు. టమోటాల్లో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. మంచి నిద్రకు, ఆరోగ్యకరమైన గుండెకు ఇది సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండు : అరటిపళ్లలో విటమిన్ బి, పొటాషియం పోషకాలు ఉంటాయి. నిద్రలేమితో బాధపడేవారికి వైద్యులు అరటిపళ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు.

సాల్మన్ చేప: అన్ని చేపల్లో ముఖ్యంగా సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి నిద్రకు బాగా సహకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES