గుండెకు మేలు చేసే కొలెస్ట్రాల్‌.. ఈ ఆహార పదార్థాలతో..

గుండెకు మేలు చేసే కొలెస్ట్రాల్‌.. ఈ ఆహార పదార్థాలతో..
గుండెకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని

గుండెకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని హృదయ సంబంధిత నిపుణులు వివరిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఏ ఆహారాలు ఉత్తమమైనవో తెలుసుకుందాం.

అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే కొవ్వు రకం. ఇది శరీరం సహజంగా ఉత్పత్తి చేస్తుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నప్పుడు ధమని గోడలను సన్నగా చేస్తుంది. వాటి ద్వారా రక్తం ప్రవహించడం కష్టంగా ఉంటుంది. కాలక్రమేణా ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌కి కారణమవుతుంది.

కొలెస్ట్రాల్ రకాలు

అధిక కొలెస్ట్రాల్ ఎలాంటి లక్షణాలను చూపించదు. శరీరంలో కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందీ తెలుసుకోవడానికి రక్త పరీక్ష అవసరం. రక్త పరీక్ష ద్వారా రక్తంలో 'మంచి', 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలను తెలియజేస్తుంది.

కొలెస్ట్రాల్ 'క్యారియర్లు' ను లిపోప్రొటీన్లు అని కూడా పిలుస్తారు. ఇవి రెండు రకాలు..

తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్: LDL కొలెస్ట్రాల్ 'చెడ్డది' ఎందుకంటే ఇది ఎక్కువగా ధమనుల గోడలకు చిక్కుతుంది

అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్: HDL కొలెస్ట్రాల్ 'మంచిది' ఎందుకంటే ఇది రక్తనాళాల నుండి 'చెడు' కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో కొవ్వును నిల్వ చేసి రవాణా చేస్తాయి. శరీరానికి అవసరం లేని ఆహారం నుండి ఏదైనా అదనపు శక్తి ట్రైగ్లిజరైడ్స్‌గా మారుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారి తీస్తుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగు మోతాదులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు.. వీటిలో ఉన్న అనేక రకాల పోషకాలు, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందించడంతో పాటు శరీరానికి కావలసిన ఫైబర్ లభిస్తుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు

కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చురుకుగా సహాయపడతాయి. వీలైనప్పుడల్లా ఈ ఆహారాలను భోజనంలో చేర్చడానికి ప్రయత్నించాలి.

1. ఓట్స్ మరియు బార్లీ

ధాన్యపు ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఓట్స్, బార్లీ ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీటిలో 'బీటా గ్లూకాన్' అని పిలువబడే ఒక రకమైన కరిగే ఫైబర్ ఉంటుంది. బీటా గ్లూకాన్ మీ రక్తంలో 'చెడు' LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. కూరగాయలు మరియు పండ్లు

రోజూ రకరకాల కూరగాయలు, పండ్లను తినడం వల్ల గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్ల నుండి కాపాడుతుంది.

3. గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు

అవోకాడో, సాల్మన్ వంటి చేపలు.. గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి.

4. చిక్కుళ్ళు, బీన్స్

మాంసానికి బదులుగా చిక్కుళ్ళు, బీన్స్ తినడం ద్వారా 'చెడు' LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. నట్స్

నట్స్‌లో గుండెకు సంబంధించిన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా గింజలు తినడం వలన 'చెడు' LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ స్థాయిలో ఉంటాయి.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడే మొత్తం ఆహారం నాణ్యతపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story