Four Common Gynic Problems: ప్రతి మహిళ తెలుసుకోవలసిన నాలుగు సాధారణ గైనిక్ సమస్యలు.. అశ్రద్ధ చేస్తే..
Four Common Gynic Problems: ఏడాదికి ఒకసారి స్త్రీ జననేంద్రియ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను మొదట్లోనే గుర్తించడంలో సహాయపడుతుంది

Four Common Gynic Problems: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఒకసారి ప్రముఖంగా ప్రపంచంలోని మహిళల ఆరోగ్య సమస్యల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. చాలా మంది మహిళలు ఆరోగ్య సంబంధిత సమస్యల కోసం డాక్టర్‌ని సంప్రదించేది గర్భధారణ సమయంలో లేదా పరిస్థితి విషమించినప్పుడు మాత్రమే.
స్త్రీలు తమ జననేంద్రియ సమస్యల గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. అంతర్గత పరీక్షతో సంబంధం ఉన్న ఇబ్బంది కారణంగా మౌనంగా బాధపడుతుంటారు చాలా మంది మహిళలు. అయితే ఏడాదికి ఒకసారి స్త్రీ జననేంద్రియ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను మొదట్లోనే గుర్తించడంలో సహాయపడుతుంది. లేదంటే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం కూడా ఉంటుంది.
మహిళలు వారి రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సాధారణ జననేంద్రియ సమస్యలు..
1. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. కారణం ఏమైనప్పటికీ, బరువు తగ్గడం లేదా పెరగడం, జీవనశైలి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అండాశయాలు సాధారణంగా పని చేయడంలో విఫలమవుతాయి.
దీర్ఘకాలంలో వీరు మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాయామం, జీవనశైలిలో మార్పులు PCOSను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే కొందరికి వారి లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణ అవసరం.
2. ఫైబ్రాయిడ్లు
ఇవి గర్భాశయంలోని క్యాన్సర్ కాని కణితులు. ప్రతి అయిదుగురిలో ఒకరు బిడ్డను కనే వయస్సులో ఫైబ్రాయిడ్‌లను కలిగి ఉంటారు. 50 సంవత్సరాల వయస్సులోపు స్త్రీలలో దాదాపు సగం మందికి ఫైబ్రాయిడ్లు ఉంటాయి. ఇవి వివిధ పరిమాణాలలో ఉండవచ్చు. రోగ లక్షణాలలో ప్రధానంగా భారీ ఋతు రక్తస్రావం, డిస్మెనోరియా, పొత్తికడుపు నొప్పి, మూత్ర సమస్యలు, గర్భం కోల్పోవడం, వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
స్త్రీ జననేంద్రియ పరీక్షలో ఫైబ్రాయిడ్‌లను సులభంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో వీటిని నిర్ధారిస్తారు. రోగి వయస్సు, లక్షణాల తీవ్రత, ఫైబ్రాయిడ్‌ల పరిమాణం బట్టి చికిత్స ప్రణాళిక మారుతుంది.
3. ఎండోమెట్రియోసిస్/అడెనోమైయోసిస్
ఇది గర్భాశయం కాకుండా ఇతర ప్రదేశాలలో గర్భం పెరిగే పరిస్థితి. సాధారణంగా, అండాశయాలపై తిత్తులు, కటి అవయవాలపై వాపు/మచ్చలు వంటివి ఏర్పడతాయి. ఇది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో దాదాపు 6-10% మందిని ప్రభావితం చేస్తుంది. ఋతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
30 నుండి 40% స్త్రీలలో గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటుంది. రోగి వయస్సు, లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది.
4. యోని ఇన్ఫెక్షన్లు
యోని సమస్యలు సాధారణంగా బహిష్టుకు ముందు ఎక్కువగా ఉంటాయి. యోని భాగంలో దురద లేదా దుర్వాసన ఉంటుంది. యోని నుండి ఆకుపచ్చ/పసుపు/గోధుమ రంగు లేదా రక్తంతో కలిపిన స్రావాలు విడుదలవుతుంటాయి. వీరికి తక్షణ వైద్య సహాయం అవసరం. పరీక్షల ద్వారా తగిన చికిత్స చేస్తారు వైద్యులు.
ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఆచరించవలసిన ఇంటి నివారణలు..
వాష్‌రూమ్‌కి వెళ్లిన ప్రతిసారీ గోరువెచ్చని నీటితో ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఏ మాత్రం తడి లేకుండా పొడిగా ఉంచుకోవాలి.
తాజా పొడి కాటన్ లోదుస్తులను ధరించాలి.
లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగినంత వ్యాయామం అవసరం.
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ పరీక్షతో పాటు ఏడాదికి ఒకసారి స్త్రీ జననేంద్రియ పరీక్ష చేయించుకోవాలి.
స్త్రీలు తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలోని వారు ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం తగదు. వైద్యుని పర్యవేక్షణలో మీ సమస్యలను నివారించుకోవడానికి ప్రయత్నించాలి.
RELATED STORIES
Shirley Setia: రెండేళ్లుగా తల్లికి దూరమయిన నటి.. సినిమా కారణంగా...
14 Jun 2022 3:53 PM GMTDisha Patani: దిశా పటాని బర్త్ డే.. బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్..
13 Jun 2022 3:25 PM GMTVishnupriya: హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానని భయపడ్డాను: విష్ణు ప్రియ
30 May 2022 3:30 PM GMTShalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్‌కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMT