జిమ్‌కి వెళ్లే కూతురు గుండెపోటుతో మరణం.. ఆమె ప్రాణాలు తీసింది ఎనర్జీ డ్రింక్స్ అని తల్లి ఆవేదన

జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలనో లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనో శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది. దానిని తగ్గించుకునే నిమిత్తం జిమ్ లకు వెళ్లడం మామూలైపోయింది. పెరిగిన కండలు త్వరగా కరగాలంటే ఒక్కోసారి వాళ్లు చెప్పే డైట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్రొటీన్ పౌడర్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు జిమ్ చేసేవాళ్లు. మరి అవి ఎంతవరకు వారి శరీరానికి ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పడం కష్టంగా ఉంటుంది ఒక్కోసారి.
ఫ్లోరిడాకు చెందిన కేటీ డోనెల్, జిమ్‌కు వెళ్లే ముందు రోజుకు మూడు ఎనర్జీ డ్రింక్స్ మరియు కెఫిన్ సప్లిమెంట్ తాగేది. 28 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడంతో ఆమె తల్లి, 63 ఏళ్ల లోరీ బారనన్ కూతురి ఆకస్మిక మరణానికి ఎనర్జీ డ్రింక్స్ కారణమని ఆరోపించింది.
ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె కుమార్తె, వ్యాయామం సమయంలో యాక్టివ్ గా ఉండేలా చూసుకోవడానికి ఎనర్జీ డ్రింక్స్ మరియు కెఫిన్ తీసుకునేది. "ఇది ఆమె వ్యాయామం చేయడానికి, ఆమెకు మరింత శక్తిని ఇస్తుందని భావించేది. ప్రతి రోజు జిమ్ కు వెళుతోంది, స్కూలుకు వెళుతోంది. అంతా బాగానే ఉంది. ఆ బజ్‌కు అలవాటు పడిందని నేను అనుకున్నాను అని ఆమె తల్లి బారనాన్ న్యూయార్క్ పోస్ట్ లో తెలిపింది.
అయితే, ఆగస్టు 2021లో ఒక దురదృష్టకరమైన రోజున, డోనెల్ స్నేహితులతో బయటకు వెళ్లి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. స్నేహితులందరూ ఆమెకు స్ట్రోక్ వచ్చిందని భావించారు. "అంబులెన్స్ కు కాల్ చేసి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆమెకు మూడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగినప్పటికీ, వైద్య అత్యవసర సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆమె కుమార్తె ఆకస్మిక మరణానికి ఎనర్జీ డ్రింక్స్ కారణమని తల్లి కన్నీరుమున్నీరయింది. కూతురి మరణం తర్వాత ఆమె కారు శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు కారులో ఎనర్జీ డ్రింక్ బాటిల్స్ ఉండడాన్ని ఆమె కనుగొంది.
"ఆమె ప్రియుడు ప్రతి రెండు మూడు రోజులకు నాలుగు ప్యాక్ [ఎనర్జీ డ్రింక్స్] కొంటానని చెప్పాడు. "కేటీ చేతిలో ఎనర్జీ డ్రింక్ లేకుండా చూడటం చాలా అరుదు అని ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పారు.
USలోని కొన్ని ప్రసిద్ధ ఎనర్జీ డ్రింక్స్‌లో ఒక డబ్బాలో 200 mg వరకు కెఫిన్ ఉండవచ్చు. 400 mg వరకు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది, కానీ Ms. డోనెల్ చాలా సంవత్సరాలుగా అనేక డబ్బాలను నిరంతరం తాగుతోంది. "మీరు మీ పిల్లలను ఈ విషయాల నుండి దూరంగా ఉంచకపోతే, మీ జీవితం నాశనమయ్యే పరిస్థితిలో మీరు కూడా ఉండవచ్చు. ఇది చాలా హానికరం మరియు ప్రాణాంతకం అని కూతురుని పోగొట్టుకున్న ఆ తల్లి దు:ఖిస్తూ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com