హెల్దీ హెయిర్ కోసం మీ డైట్‌లో ఈ ముఖ్యమైన పోషకాలు..

హెల్దీ హెయిర్ కోసం మీ డైట్‌లో ఈ ముఖ్యమైన పోషకాలు..
జుట్టు ఊడిపోతుంటే ఎవరికైనా ఎంతో బాధగా ఉంటుంది. ఎవరేం చెప్పినా చేయాలనిపిస్తుంది.

జుట్టు ఊడిపోతుంటే ఎవరికైనా ఎంతో బాధగా ఉంటుంది. ఎవరేం చెప్పినా చేయాలనిపిస్తుంది.. మగవారికైనా, ఆడవారికైనా తల మీద నాలుగు వెంట్రుకలు ఉంటేనే.. అందం. బట్టతల వస్తుందంటే బెంబేలు పడిపోయే పురుషులు స్నేహితులను సలహాలు అడుగుతుంటారు ఏదైనా మార్గం ఉంటే చెప్పమని. ఇక స్త్రీలైతే రాలిపోతున్న వెంట్రుకలను చూసుకుని తెగ బాధపడిపోతుంటారు.. షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ఎన్నో మార్చేస్తుంటారు. అలాంటివి ఎన్ని చేసినా అన్నింటికన్నా ముఖ్యమైనది హెల్దీ హెయిర్ కు కావలసింది ఆహారంలో తగిన పోషకాలు ఉండేలా చూసుకోవడం. అవి శరీరానికి అందేలా ఏర్పాటు చేసుకోవడం.

పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జుట్టు రాలడానికి గల కారణాలను వివరించారు. PCOS, హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రుగ్మతలు, పోషకాహార లోపాలు వంటివి జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాలుగా వివరించారు.

ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను సూచిస్తున్నారు.

ప్రొటీన్ : బలమైన జుట్టుకు ఇది చాలా ముఖ్యమైనది. దీనిని కాయధాన్యాలు, బీన్స్, గుడ్లు, పాల ఉత్పత్తులు, చికెన్, మాంసం, చేపల్లో కనుగొనవచ్చు.

ఐరన్ : ఆకు కూరలు, చిక్కుళ్ళు, గింజలు, చికెన్, మాంసం మన శరీరానికి ఇనుమును అందిస్తాయి.

విటమిన్ డి : ఇది సూర్యరశ్మి, గుడ్లు, సముద్రపు ఆహారం ద్వారా పొందవచ్చు.

బి విటమిన్లు : ఇవి తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకు కూరలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, అరటిపండ్లు, గింజలు, వేరుశెనగలు, చికెన్‌లో లభిస్తాయి.

విటమిన్ సి : ఇది సిట్రస్ పండ్లు, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, టొమాటోలు, కివి, బ్రోకలీ నుండి తీసుకోవచ్చు.

జింక్ : గుడ్లు, చికెన్, డార్క్ చాక్లెట్, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, నువ్వులు, వేరుశెనగ, సోయా జింక్ యొక్క మూలాలు.

సల్ఫర్ : గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, బీన్స్, చిక్కుళ్ళు,గింజల్లో అధికంగా ఉంటుంది.

విటమిన్ ఇ : మీరు పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, కూరగాయలు, అవకాడోలలో విటమిన్ ఇని కనుగొనవచ్చు.

పూజా జుట్టు పెరుగుదలకు ఒక హెయిర్ ప్యాక్ ను కూడా సూచించారు.

ఒక బాణలిలో, కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతి గింజలు, కలోంజి గింజలు, తరిగిన ఉల్లిపాయలు వెయ్యాలి.

ఉల్లిపాయ బ్రౌన్ రంగులోకి మారే వరకు వేడి చేసి, ఆపై మంటను ఆపివేసి చల్లబరచండి.

చల్లారిన తర్వాత, నూనెను శుభ్రమైన గాజు సీసాలోకి వడకట్టాలి. అందులో పావు వంతు వరకు ఆముదం కలిపి బాగా షేక్ చేయాలి. దీనిని తలకు రాసుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 3 టేబుల్ స్పూన్ల నూనెను ఒక గిన్నెలో కలపాలి. దీనిని వారానికి రెండు సార్లు వెంట్రుకల కుదుళ్లకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఓ గంట ఉంచుకుని గోరు వెచ్చని నీళ్లతో కడగాలి. మీ జుట్టు ఆరోగ్యంగా, వెంట్రుకలు పట్టుకుచ్చులా మెరిసి పోతుంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర అని గుర్తుంచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story