దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా,,!

సీజన్ తో సంబంధం లేకుండా మనకి అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి.. చూడడానికి ఎర్రగా చాలా అందంగా కనిపించే ఈ పండు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె సంబంధిత వ్యాదులకి చెక్ పెట్టడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.
రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
అధికరక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడం మంచిది.
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ దీనికి ఉంది.
గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది.
ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com