కూరల్లో కరివేపాకు తీసిపడేస్తున్నారా..? ప్రయోజనాలు తెలుసా..?

మీ వంట గదిలో ఉండే ఎన్నో ఔషద గుణాలకు కొదవ లేదు. వాటిలో ఒకటి కరివేపాకు. ఇంట్లో ఏ కూర చేసిన కరివేపాకు కచ్చితంగా వాడతారు. కరివేపాకు లేకుంటే కూర రుచి వాసన రాదు. అయితే కొంత మంది మాత్రం కరివేపాకును అసలు తినరు. కూరలో లేదా ఉమ్మా వంటి టిఫిన్ పదార్థల్లో కరివేపాకు వస్తే తిసిపడేస్తారు. అయితే మీరు తీసిపడేస్తున్న కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా..
*కరివేపాకును తినడం వల్ల రక్తంలో షూగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. కరివేపాకులోని యాంటీ హైపర్ గ్లెసెమిక్.. రక్తనాళాల్లోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది.
*కరివేపాకులో ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు పీచు సహకరిస్తుంది.
*కరివేపాకు కంటికి మంచిది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. మనం రోజు తినే ఆహారంలో కరివేపాకు తిసుకోవడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కంటి సమస్యలు దూరం అవుతాయి.
*కరివేపాకు మిశ్రమాన్ని గ్లాసులో మజ్జిగలో చిటికెడు ఇంగువ, కరివేపాకు, కాస్త సొంపు కలిపి తాగితే అజీర్తి సమస్య దూరమవుతుంది.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
*కరివేపాకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలికామ్లం, నియాసిన్, బీటా కెరోటిన్, ఇనుము, కాల్షియం, పీచు, మాంసకృత్తులు, కార్బొహ్రైడేట్లు పుష్కలంగా లభిస్తాయి.
*తెల్ల జుట్టు సమస్యకు కూడా కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో మెంతికూర, వేపాకు, కరివేపాకు వేసి చిన్న మంటపై వేడిచేయాలి. చల్లార్చి పడుకునే ముందు తలకు పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నెరవకుండా నల్లగా నిగనిగలాడుతుంది.
*రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకుల్ని నమలడం వల్ల కొవ్వుస్థాయులు తగ్గుతాయి.
*కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిన్, బ్లాడర్ సమస్యలను తగ్గిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com