హెల్త్ & లైఫ్ స్టైల్

Gorintaku Benefits: ఆషాఢంలో గోరింట.. అందం, ఆరోగ్యం..

Gorintaku Benefits: ఏడాదిలో వచ్చే పన్నెండు మాసాల్లో కొన్ని మాసాలకు కొన్ని ప్రత్యేకతలు.. ఆషాడం, శ్రావణం, కార్తీక మాసాలను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.

Gorintaku Benefits: ఆషాఢంలో గోరింట.. అందం, ఆరోగ్యం..
X

Gorintaku Benefits: ఏడాదిలో వచ్చే పన్నెండు మాసాల్లో కొన్ని మాసాలకు కొన్ని ప్రత్యేకతలు.. ఆషాడం, శ్రావణం, కార్తీక మాసాలను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆషాఢంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి అమ్మగారింటికి రావడం, భర్తకు దూరంగా ఉండడం కించిత్ కష్టమే అయినా.. ఆ ఎడబాటు మధురంగానే ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం మరింత పెరుగుతుంది. ఇక ఈ మాసంలో ప్రత్యేకించి కొత్త పెళ్లి కూతురు కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. బాగా పండితే భర్త మీద ప్రేమ ఎక్కువగా ఉందని, పెళ్లి కావలసిన యువతులు పెట్టుకుంటే మంచి భర్త లభిస్తాడని అంటారు.. అవన్నీ ఎలా ఉన్నా గోరింటాకు అరచేతికి అందంతో పాటు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. అంటు రోగాలు కూడా వ్యాప్తి చెందే కాలం ఇది. బయటి వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా అంటురోగాల బారిన పడుతుంది. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ఒంట్లో వేడినీ హరిస్తుంది. గోరింటలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

గోరింట పెట్టుకోవడం వలన గోళ్లు పెళుసుబారకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువగా నీళ్లలో నానే పనులు చేసే మహిళలకు కాళ్ల పగుళ్లు కూడా సంభవిస్తుంటాయి. గోరింటాకు కాలి పగుళ్లను నివారిస్తుంది. ఆషాడం అనే కాదు అవకాశం ఉన్న ప్రతిసారి అరిచేతికి గోరింటాకు పెట్టుకునే అలవాటు ఉండడం మంచిది.

ప్రస్తుత కాలంలో మెహిందీ పేరుతో అనేక రకాల గోరింట పొడులు, కోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటన్నింటికంటే చెట్టు నుంచి తెచ్చిన గోరింటాకును రుబ్బి చేతులకు పెట్టుకుంటే దానిని నుంచి లభించే బెనిఫిట్స్ పొందవచ్చు. అది శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది. కోన్లు, పొడులలో కృత్రిమ రసాయనాలు కలుపుతారు.. వేడుకల సందర్భాల్లో అయితే తప్పదు కానీ, ఆకు దొరికే సమయంలో అదే రుబ్బి పెట్టుకోవడం శ్రేయస్కరం.

శరీరాన్ని, మనసును ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢమాసం. ఈ మాసంలో బోనాలు, జాతరలు ఆయా ప్రాంతాలను బట్టి ఆచరిస్తుంటారు.. సంప్రదాయ పద్ధతులను తేలిగ్గా కొట్టిపారేయకుండా ఆచరిస్తే అందం, ఆరోగ్యం.

Next Story

RELATED STORIES