Chia Seeds: చియా సీడ్స్‌లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

Chia Seeds: చియా విత్తనాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ చిన్న విత్తనాల్లో ప్రోటీన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, జింక్, అయాన్, ఫైబర్ మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మీ శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
చియా గింజల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదనంగా, విత్తనాలు చాలా ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలవు. మధుమేహం ఉన్న వ్యక్తులు చియా విత్తనాలను వివిధ మార్గాల్లో తీసుకోవచ్చు.
చియా గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఎముకల ధృఢత్వానికి ఈ రెండు పోషకాలు కీలకం. చియా గింజల్లో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చియా గింజలలో గుండె-ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా, చియా విత్తనాలు UV రేస్ వల్ల కలిగే హాని నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇది ముడతలను నివారిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది.
నానబెట్టిన చియా విత్తనాలను హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఇది వెంట్రుకలను మృదువుగా ఉంచుతుంది. చియా గింజలు పొడి జుట్టుకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com