తృణధాన్యలతో బరువు తగ్గుతారా..? ఏం తింటే మంచిది..!

ఈ రోజుల్లో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నావారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పని ఒత్తిడి కారణంగానో, లేదా మరే ఇతర కారణాల వల్ల ఊబకాయుల సంఖ్య పెరిగిపోతుంది. బరువు తగ్గడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. దాని కోసం వాకింగ్ , జాగింగ్ లాంటి వ్యాయమాలు చేస్తున్నారు. అంతే కాదు నిత్యం తినే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బరువు పెరగడానికి గల కారణాల్లో ముఖ్యమైనవి వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్, ఫస్ట్ ఫుడ్ వంటికి కూడా ఒక కారణం. అంతేకాదు శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్‌లెస్‌గా మారిపోతుంటారు. అయితే ముడిబియ్యంగా తినడంతోపాటు పొట్టు తీసిన ధాన్యలతో పోలీస్తే పొట్టు తీయని ధాన్యతో స్థూలకాయం వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
పొట్టు తీయని ధాన్యాలను (హోల్ గ్రేయిన్స్‌ను) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నిరూపితమైన ఈ అధ్యయన ఫలితాలను 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురించారు.
పొట్టు ఉన్న కారణంగా హోల్ గ్రెయిన్స్ జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి. ఇక ఇదే ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిశోధకులు. ఫలితంగా ఇన్సులిన్ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు పెరగకుండా ఉండే మరో ప్రయోజనమూ ఉంటుందట.
పిల్లలకు చిరుధాన్యాల ఆహారం ఎంతో ప్రయోజనం..
పిల్లలకు ఆరు మాసాలు దాటిన దగ్గర నుంచి చిరుధాన్యాలు తినిపించవచ్చు. జావ రూపంలో చేసి ఇవ్వవచ్చు. ముఖ్యంగా రాగులు, జొన్నలు, సజ్జలు మొలకెత్తించి, ఎండబెట్టి మాల్ట్‌లాగా చేసి ఇవ్వొచ్చు. జొన్నలు, సజ్జలు పేలాలుగా వేపుకుని, వేపిన ఇతర చిరుధాన్యాలతో కలిపి పొడి చేసుకుని, జావలాగా చేసుకుని దానిని ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు కలిపి పిల్లలకు తినిపిస్తే మంచిది.
ఇలాంటి వాటిని కూడా ట్రై చేయండి.
వరిగ బియ్యం
వరిగల్లో లిసితిన్ పుష్కలంగా ఉండ డంతో నరాల పటుత్వానికి మంచి ఆహారం. వరిగలు వ్రణాలు (పుండ్లు), మూత్రాశయ వ్యాధులకు చక్కని ఆహారం. మూత్రంలో మంట, రక్తం పడడం వంటి సమస్యలను దూరం చేస్తోంది. చర్మసంబంధ వ్యాధులు, ఎముకల్లో పటుత్వానికి, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా, హృదయ రోగాలకు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతోంది.
ఆరిక బియ్యం
రక్తహీనత, మధుమేహం గాయాలు త్వరగా మానడానికి, వ్రణాలు(పుండ్లు, గడ్డలు) త్వరగా తగ్గడానికి, చర్మ సమస్యలు, కీళ్ళ వాతం, నరాల పటుత్వం, మలబద్ధకం, సుఖ నిద్రకు చక్కటి ఆహారం. దీనిలోని పీచు పదార్థం, సూక్ష్మ పోషకాల వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.
అండు కొర్ర బియ్యం
రక్తహీనత, మలబద్ధకం, జీర్ణకోశ వ్యాధుల నివారణ, ఊబకాయం, థైరాయిడ్, కంటి సమస్యలకు చక్కటి ఆహారం. అండుకొర్రలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల కేన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతోంది. రక్తంలో చెడు క్రొవ్వును బయ టకు పంపించేస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది.
సజ్జలు (గంట్లు)
సజ్జల్లో కెరోటిన్ అనే పదార్థం పుష్కలంగా ఉండడం వలన కంటిచూపునకు చాలా మంచిది. ఊబకాయం, మధుమేహం, మెలలతో బాధపడేవారికి చక్కని ఆహారం. రక్తపోటుకు, గుండె బలానికి, ఎసీడీటీ సమస్యలకు మందు. మూర్చవ్యాధి, నిద్రలేమి, పిల్లల్లో ఆస్మా సమస్యలను పరిష్కరిస్తోంది.
సామ బియ్యం
పైత్యం ఎక్కువ అవడం వల్ల వచ్చే సమస్యలను నిరోధిస్తుంది. భోజనం తరువాత గుండెల్లో మంట, పుల్లత్రేన్పులు రావడం, పైత్యరసం గొంతులో వచ్చినట్టు ఉండటం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. వీర్యకణ సమస్యలు,ఆడవాళ్ళ రుతు సమస్యలు,సంతానలేమి నివారణ, మైగ్రైన్, గుండె, ఆర్థరైటిస్ మొదలైన సమస్యలకు మందు.
ఊద బియ్యం
గర్భిణులు,బాలింతలకు ఊదలు మంచి బలవర్థకమైన ఆహారం. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకానికి, మధుమేహానికి, జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవుల్లో వచ్చే పుండ్లు,కేన్సర్ లాంటి సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి. కాలేయ సమస్యలకు, కీడ్ని పనితీరును మెరుగు పరుస్తోంది.శారీరక శ్రమ లేకుండా.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్ళకు ఊదలు చాలా మంచి ఆహారం.
కొర్ర బియ్యం
మధుమేహాన్ని నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉదర, మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆకలి మాంద్యం, నరాల పటుత్వానికి, అతిసారం, రక్తహీనత, ఊబకాయం, మూర్చరోగం, కీళ్ళ వాతం, జ్వరం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి చక్కటి ఆహారం.
రాగులు(చోళ్ళు, తైదలు)
ఎముకల దృఢత్వం, రక్తహీనత, జీర్ణశక్తిని పెంపొందించేందుకు, బాలింత స్త్రీలలో పాల ఉత్పత్తికి, ఊబకాయానికి, మలబద్ధకానికి, ప్రేగు కేన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి రాగులు చక్కటి ఆహారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com