జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు..!

జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు..!
జామ పండ్ల ఆకుల రసం తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తరవాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పైన శ్రద్ధ మరింతగా పెరిగింది. బాడీలో ఇమ్యూనిటీ పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా పండ్లను తీసుకుంటారు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ జామపండుకు కూడా మంచి గీరాకీ ఉంది. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అయితే జామపండ్లు మాత్రమే కాదు జామ ఆకులతోనూ చాలా ప్రయోజనాలున్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని చాలా మందికి తెలియదు. అయితే జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


♦ జామ పండ్ల ఆకుల రసం తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే.

♦ జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు విషవ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తాయి.

♦ పీరియడ్స్ టైమ్‌లోమహిళలు నొప్పితో చాలా బాధపడుతుంటారు.. ఆ సమయంలో వారు ఈ రసం తీసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది.


♦ జామ ఆకుల రసం జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి.

♦ జామ ఆకుల రసంతో అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు.


♦ జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది.

ఆరోగ్యానికే కాదు అందానికి కూడా జామ ఆకులు బాగానే పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story