Jonna Rotte: జొన్నరొట్టెలకు పెరుగుతున్న క్రేజ్.. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే..

Jonna Rotte (tv5news.in)

Jonna Rotte (tv5news.in)

Jonna Rotte: టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల ఎన్నో ఆహార పదార్థాలను మనం పక్కన పెట్టేశాం.

Jonna Rotte: టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల ఎన్నో ఆహార పదార్థాలను మనం పక్కన పెట్టేశాం. కానీ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలోని ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే మళ్లీ పాత పద్దతుల్లోనే కొన్ని ఆహార పదార్ధాలను తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైన ఆహార పదార్థం జొన్నరొట్టె.

తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈ జొన్న రొట్టెనే తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడి ప్రజలు. జొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఎన్నో అత్యవసర పోషకాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు జొన్న రొట్టె చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఈ జొన్న రొట్టె అనేది ఫుడ్ బిజినెస్‌లో కీలకంగా కూడా మారింది. హైదరాబాద్‌లో కనీసం గల్లీకి ఒకటైనా రొట్టెలు చేసేవారు కనిపిస్తున్నారు.

రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారు అనుకునేవారు, షుగర్ పేషెంట్లు ఆ సమయంలో ఎక్కువగా చపాతీలు తినడానికి ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ను జొన్న రొట్టె తీసుకుంది. స్టా్ర్ హోటల్స్‌లో సైతం జొన్న రొట్టె లభించే స్థాయికి చేరుకుంది దీని పాపులారిటీ. రోడ్డు మీద రూ.10కి దొరికే జొన్నరొట్టెకు స్టార్ హోటల్స్‌లో రూ.150 వరకు ఛార్జ్ చేస్తున్నారు.

జొన్నరొట్టెకు ఉండే ముఖ్యమైన అడ్వాంటేజ్ అది పాడవ్వకపోవడం. చేసిన వెంటనే దీనిని తినకపోయినా.. తరువాతి రోజు వరకు కూడా అది తినడానికి మంచిదే. జొన్న రొట్టెలు తినడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి అవి చేసే వారికి కూడా డిమాండ్ పెరిగింది. అందరికీ జొన్నె రొట్టెలు చేయడం రాదు. అందుకే దీనిని ప్రత్యేకంగా ఒక కళగా పరిగణిస్తారు.

జొన్న కేవలం మనుషులకే కాదు పశువులకు కూడా ఆరోగ్యకరమే. ఈ జొన్న వల్ల మరిన్ని ఉపయోగాలను తెలుసుకుని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి దీంతో సిరప్‌, ఇథనాల్‌, బయో ఫ్యూయల్‌ కూడా తీయొచ్చని తేల్చారు. జొన్నతో ప్లాస్టిక్ కూడా తీయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.

జొన్న చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంట్లోని ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. ఇది జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో కూడా తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story