Plums:రేగు పండ్లలో పోషకాలు పుష్కలంగా.. గుండె ఆరోగ్యానికి..

Plums:రేగు పండ్లలో పోషకాలు పుష్కలంగా.. గుండె ఆరోగ్యానికి..
X
Plums: చిన్న రేగు పండ్లు చిత్రంగా అనిపిస్తాయి.. పుల్లగా, తియ్యగా ఎవరైనా తినేలా ఉంటాయి. సీజన్‌లో దొరికే రేగుపళ్లలో అనేక పోషకాలు ఉంటాయి.

Plums: చిన్న రేగు పండ్లు చిత్రంగా అనిపిస్తాయి.. పుల్లగా, తియ్యగా ఎవరైనా తినేలా ఉంటాయి. సీజన్‌లో దొరికే రేగుపళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. సగటున ఒక్కో పండులో 30 కేలరీలు ఉంటాయి.

రేగు పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఆరోగ్యానికి రేగు పండు అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు రోజుకు 50 గ్రాముల రేగుపండ్లు తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడి, ఎముకల క్షీణత తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఆరోగ్యకరమైన గుండెకు.. రేగు పండ్లు పొటాషియం యొక్క మంచి మూలం. అధిక రక్తపోటు, గుండె జబ్బుల వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం నుంచి దూరంగా ఉండొచ్చు.

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రేగు పండ్లలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతు నొప్పిని, అస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం. రేగుపండు గింజ చాలా గట్టిగా ఉంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ తాగితే నీళ్ల విరోచనాలకు మంచి మందులా పని చేస్తుంది. రేగు పండు గుజ్జులో, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్సు వేసి కచ్చా పచ్చాగా రుబ్బి ఎండలో వడియాల మాదిరిగా పెడుతుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇవి నోటికి ఆరోగ్యాన్ని, రుచిని అందిస్తాయి.

ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.

ఒత్తిడి, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులను, కొన్ని క్యాన్సర్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని నివారిస్తుంది. రేగుపండ్లు తినేటప్పుడు పొరపాటున గింజలు మింగేస్తుంటారు.. ఆ గింజ అన్నవాహికకు అడ్డుపడుతుంది. ఈ విత్తనాలలో అమిగ్డాలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరం టాక్సిన్ సైనెడ్‌గా మారుతుంది. ఈ విత్తనాన్ని తీసుకుంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story