Ragi:వేసవిలో శరీరాన్ని చల్లబరిచే రాగి జావ.. బరువు తగ్గించేందుకు..

Ragi:వేసవిలో శరీరాన్ని చల్లబరిచే రాగి జావ.. బరువు తగ్గించేందుకు..
Ragi: ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్‌తో బాధపడేవారికి రాగి ఔషధంలా సహాయపడుతుంది.

Ragi: రాగులు దక్షిణ భారతదేశంతో పాటు ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరొందింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమమైన ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి జావ మంచి బలవర్ధకమైన ఆహారం ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలు గట్టిపడతాయి.

రాగుల గురించి మరి కొన్ని విషయాలు

భారతదేశంలో కర్ణాటక అత్యధికంగా రాగులను ఉత్పత్తి చేస్తుంది.

ఇతర తృణధాన్యాల మాదిరిగా కాకుండా ఈ తృణధాన్యాన్ని పాలిష్ చేయనవసరం లేదు.

బరువు తగ్గడానికి ఇది సహజమైన ఆహారం.

మండే వేసవి రోజులలో కూడా రాగి మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.

రాగి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాగులను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాగులు అందించే మరికొన్ని అద్భుత ప్రయోజనాలు.

1. అధిక ప్రోటీన్:

ఎలుసినియన్ అనేది రాగిలో కనిపించే ప్రధాన ప్రోటీన్ కంటెంట్. ఈ ప్రోటీన్ పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాగిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి.

2. బరువు తగ్గించే ఏజెంట్:

రాగిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో బ్లడ్ లో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. దానిని ఇన్సులిన్‌గా మారుస్తుంది. రాగిని ఉదయం పూట తీసుకోవడం ఉత్తమం. రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3. మీ చర్మాన్ని వృద్ధాప్యం నుండి నిరోధిస్తుంది:

రాగి ఒక సహజ చర్మ సంరక్షణా ఏజెంట్. రాగిలో మెథియోనిన్, లైసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని దద్దుర్లు, ముడతలు వంటి వాటిని నివారిస్తుంది. రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రాగిలో విటమిన్ ఇ కూడా ఉంది, ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. .

4. రాగి మీ జుట్టుకు మంచిది:

రాగుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కెరాటిన్ జుట్టుకు సంబంధించిన ప్రధాన ప్రోటీన్. ఇది రాగుల్లో అధికంగా ఉంటుంది. రాగి మీ శరీరంలో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

5. రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది:

రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగిలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందిజ. ఇది ఎముకలకు చాలా మంచిది.

6. తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది:

పాలిచ్చే స్త్రీలు పచ్చి రాగులను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా మహిళల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. తల్లి పాల ద్వారా బిడ్డకు కావలసిన కాల్షియం, ఇనుము అందుతుంది.

7.మధుమేహాన్ని నివారిస్తుంది:

రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రాగుల్లో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇతర తృణ ధాన్యాలతో పోలిస్తే రాగిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. రాగులను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. రాగి శోషక పదార్థంగా పనిచేస్తుంది. అది పిండి పదార్ధాలను గ్రహిస్తుంది. అందుకే రాగులను తినే చాలా మందికి తరచుగా ఆకలిగా అనిపించదు.

8. ఆందోళన, డిప్రెషన్ దూరం చేస్తుంది.

ఇది శరీరానికి సహజమైన రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్‌తో బాధపడేవారికి రాగి ఔషధంలా సహాయపడుతుంది. అధిక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి ప్రశాంతంగా ఉంచుతుంది. వేసవి కాలంలో రాగి జావ శరీరాన్ని చల్లబరుస్తుంది.

9. పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది:

పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధించే ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్‌లు అధికంగా ఉన్నందున రాగి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. రాగిలో ఉండే లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుండి మహిళలను రక్షిస్తుంది.

Tags

Next Story