Water Melon Seeds: పుచ్చకాయ ముక్కలు తింటూ గింజలు పడేస్తున్నారా.. ఇది తెలిస్తే..

Water Melon Seeds: పుచ్చకాయ ముక్కలు తింటూ గింజలు పడేస్తున్నారా.. ఇది తెలిస్తే..
Water Melon Seeds: పుచ్చకాయ గింజలు అత్యంత పోషకాలు కలిగిన విత్తనాలలో ఒకటి.

Water Melon Seeds: సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. ఇక రోడ్ సైడ్ బండ్ల మీద అయితే చక్కగా కట్ చేసిన పుచ్చ ముక్కలు, పుచ్చ కాయ జ్యూస్ కూల్‌గా అందిస్తుంటారు. చల్లగా నోట్లోకి జారుతున్న పుచ్చముక్కల మధ్యలో ఓ చిన్న గింజ వచ్చిందంటే చిరాకు పడుతుంటారు చాలా మంది. కానీ పుచ్చగింజలు గురించి తెలిస్తే మరెప్పుడూ పడేయాలనిపించదు. అలా డైరెక్ట్‌గా తినలేకపోతే వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసుకుని కూడా తినవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

పుచ్చకాయ గింజలు అత్యంత పోషకాలు కలిగిన విత్తనాలలో ఒకటి. అవి ప్రొటీన్లు, విటమిన్లు, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం వంటివి ఎన్నోపుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి వాటిని వేయించండి. ఈ విత్తనాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు కాల్చిన పుచ్చకాయ గింజల్లో దాదాపు 600 కేలరీలు ఉంటాయి.

పుచ్చకాయ గింజల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

1. చర్మానికి ప్రయోజనాలు

కాల్చిన పుచ్చకాయ గింజలు మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మొటిమల వ్యాప్తిని నిరోధిస్తుంది. మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. నీరసాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

2. జుట్టు కోసం ప్రయోజనాలు

ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం మరియు కాపర్ మీ జుట్టుకు చాలా ముఖ్యమైన పోషకాలు. పుచ్చగింజలను మెత్తగా పొడి చేసి దానిని పెరుగులో కలిపి తలకు పట్టించండి. ఇది మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రొటీన్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మీ జుట్టును సిల్కీగా ఉంచే మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

3. బ్లడ్ షుగర్ నియంత్రణ

పుచ్చకాయ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్థాయి.

4. శక్తి స్థాయిలను పెంచుతుంది

పుచ్చకాయ గింజల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ శరీర జీవక్రియకు తోడ్పడుతుంది.

5. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది

ఎండిన పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఎముకలు పెళుసుబారకుండా నిరోధిస్తుంది. వీటిలో ఉన్న రాగి, మాంగనీస్, పొటాషియం పోషకాలు ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవి మీ ఎముకలను బలోపేతం చేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story