Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే ప్రమాదమే..

Health Tips (tv5news.in)
Health Tips: ఉదయం లేవగానే కాసేపు బెడ్‌పైనే ఉండి.. కాలేజీకి, ఆఫీస్‌కు టైమ్ అయిన తర్వాతే లేచి.. త్వరత్వరగా పరిగెత్తడం ఈరోజుల్లో చాలామందికి అలవాటే. ఈ క్రమంలో ఒక్కొక్కసారి ఉదయం పూట ఆహారం తీసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే ఏది పడితే అది తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఏ ఆహార పదార్ధాలు తీసుకోకూడదు అన్నదానిపై వైద్యులు ఓ స్పష్టత ఇచ్చారు.
చాలామందికి పొద్దున లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. టీ అయితే రోజూ తీసుకున్నా పరవాలేదు కానీ కాఫీ మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. దీని వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.
కొందరికి ఎక్కువగా చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. దాని వల్ల ఎప్పుడూ పెద్దగా ఏ సమస్య ఉండదు కానీ దాని పరిగడుపున మాత్రం తీసుకోవద్దట. ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల వాటి నుండి విడుదలయ్యే ఆమ్లాల వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య ఏదో ఒక ఆరోగ్య సమస్య అందరినీ పీడిస్తూనే ఉంది. దానికోసం వారు పొద్దుపొద్దునే టాబ్లెట్లు వేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే హై డోస్ మాత్రలు తిన్న తర్వాత వేసుకోవాలి కానీ ఖాళీ కడుపుతో వేసుకోకూడదని వైద్యులు అంటున్నారు.
ఉదయం పూట ఎక్కువగా తీసుకునే వాటిలో కాఫీ, టీతో పాటు కొన్ని జ్యూస్‌లు కూడా ఉంటాయి. కొందరు ఉదయం లేవగానే జ్యూస్‌లు తీసుకోవడం కూడా ఇష్టపడతారు. అయితే మిగతా జ్యూస్‌లు పరవాలేదు కానీ నిమ్మరసం మాత్రం పరిగడుపున తీసుకోకూడదట. ఎంతైనా వీటన్నింటికంటే ఉదయం పూట సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. కానీ వాటిలో కూడా మసాలా ఆహారాలు పరిగడుపున దూరం పెడితే మంచిది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com