Health Tips: పదహారేళ్ల అమ్మాయిలు ఏం తినాలో తెలుసా?

Health Tips: పదహారేళ్ల అమ్మాయిలు ఏం తినాలో తెలుసా?
Health Tips: టీనేజ్‌లో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ అమ్మాయిలు వారి ఆరోగ్యంపై మరింత దృష్టిపెట్టాలి.

Health Tips: టీనేజ్‌లో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ అమ్మాయిలు వారి ఆరోగ్యంపై మరింత దృష్టిపెట్టాలి. టీనేజ్‌లోనే ఎక్కువగా శారీరిక పెరుగుదల ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అయితే ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే మాంసాహారులే కావాల్సిన అవసరం లేదు. శాకాహారులైనా సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు వైద్యులు.

పోషకాహారం అనేది అందరికీ ముఖ్యమే. కానీ టీనేజ్ పిల్లలకు అది మరింత అవసరం. క్రీడారంగంలో ఉండే వారయితే పోషకాహారాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ఎందుకంటే రోజు వీరి శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అధికంగా వ్యాయామం చేయడం, ఆటలు ఆడడమే దీనికి కారణం. అందుకే వారికి ఎక్కువ శక్తి కావాలి.

కార్బోహైడ్రేట్స్‌ అనేది టీనేజ్ వయసులో ఉన్న క్రీడాకారులకు చాలా ముఖ్యం. అన్నం, గోధుమలు, రొట్టెలు, పాస్తా, చిరు ధాన్యాలలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇక శాకాహార ప్రొటీన్ల కోసం పప్పు ధాన్యాలు, సోయా, సెనగలు, అలసందలు లాంటి గింజలు; మీల్‌ మేకర్‌, పనీర్‌, సొయా పనీర్‌, పాలు, పెరుగు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

క్రీడాకారులు ఫిట్‌గా ఉండడానికి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటుంటారు. కానీ అలా చేస్తే శరీరంగా కొవ్వు శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దానికోసం పల్లీలు, బాదం, జీడిపప్పు, ఆక్రోట్‌, పిస్తా లాంటివి ఆహారంలో చేర్చాలి. ఇక పండ్ల విషయానికొస్తే అరటి, ఆపిల్‌ పండ్లు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం లాంటివి తీసుకోవాలి. వ్యాయామం అయిపోయిన తర్వాత నీళ్లు, పండ్లు, ప్రొటీన్‌ కోసం నట్స్‌, పాలు లాంటివి వెంటనే తీసుకోవాలి.

ఆకుకూరలు లాంటివి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఇక మనిషి ఆరోగ్యం కోసం ఆహారం ఎంత ముఖ్యమో సరిపడా నిద్ర కూడా అంతే ముఖ్యం. సమయానికి వ్యాయామం లాగా సమయానికి నిద్రను కూడా టీనేజ్ పిల్లలు పాటించాలి.

Tags

Read MoreRead Less
Next Story