Health Tips For Teeth: పళ్లను జాగ్రత్తగా ఉంచుకోవాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..

Health Tips For Teeth: మామూలుగా మనం శరీర ఆరోగ్యంపై చాలా దృష్టిపెడతాం. మన శరీరానికి తగిన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ.. ఎప్పటికప్పుడు ధృడంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే పళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కొన్ని ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటే పళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
పళ్ల ఆరోగ్యం మీదే శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. క్యావిటీ లాంటివి మనం తరచుగా చూసే పళ్ల సమస్యలు. అయితే ఇలాంటి పళ్ల సమస్యలకు దూరంగా ఉండాలంటే మన డైట్‌ను కాస్త మారిస్తే సరిపోతుంది. పళ్ల సమస్యలకు దూరంగా ఉండాలంటే కష్టపడి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం పళ్లకు అంత మంచిది కాదు. మామూలుగా ఇలాంటి డ్రింక్స్ శరీరానికి కూడా మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. శరీరానికి మాత్రమే కాదు.. ఇవి పళ్లకు కూడా హాని చేసేవాటిలో ఒకటి.
స్నాక్స్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు.. అందులోనూ ముఖ్యంగా చిప్స్ అంటే చాలామందికి ఇష్టం. అయితే పొటాటో చిప్స్ పళ్లకు అంత మంచివి కాదంటున్నారు వైద్యులు. మిగతా వాటితో పోలిస్తే చిప్స్ ఎక్కువగా పళ్ల మధ్యలో ఇరుక్కుంటాయి. దీని వల్ల క్యావిటీ సమస్యలు రావచ్చు.
డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ పనిచేస్తాయని వైద్యులు చెప్తుంటారు. కానీ అవి పళ్లకు మంచివి కావని డెంటిస్టులు అంటున్నారు.
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌తో పాటు వైన్, కాఫీ, టీ లాంటివి కూడా పళ్ల ఆరోగ్యానికి అంత మంచివి కాదంటున్నారు డెంటిస్టులు. రోజూ ఇవి తాగే అలవాటు ఉన్నవారికి పళ్లు పచ్చగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు.
చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం పళ్లకు మంచిది కాదని మనకు తెలిసిన విషయమే. చాక్లెట్లలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. చాక్లెట్ల వల్ల పళ్లకు దీర్ఘకాలక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com