watermelon In summer : మండుతున్న ఎండలు.. పుచ్చకాయనే బెస్ట్..!

watermelon In summer : మండుతున్న ఎండలు.. పుచ్చకాయనే బెస్ట్..!
X
watermelon In summer :ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం ఎంతో మంచిది. పుచ్చకాయలు వలన శరీరానికి పుష్కలమైన నీరు మాత్రమే కాకుండా పలు పోషకాలు కూడా అందుతాయి.

watermelon In summer : తెలుగు రాష్ట్రాలలో అప్పుడే ఎండలు దంచికోడుతున్నాయ్... పగటిపూట భానుడు భగభగమంటున్నాడు. అయితే ఇలాంటి సమయంలో కూల్ డ్రింక్స్ కన్నా పుచ్చకాయ చాలా బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు... ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం ఎంతో మంచిది. పుచ్చకాయలు వలన శరీరానికి పుష్కలమైన నీరు మాత్రమే కాకుండా పలు పోషకాలు కూడా అందుతాయి. ప్రధానంగా అయితే శక్తిని కోల్పోకుండా ఉంచే.. ఎలక్రోలైట్లు, సుక్రోజ్, ప్రక్టోజ్, గ్లూకోజ్ ఇందులో ఉంటాయి. దీనితో నీరసం, అలసట రాకుండా ఉంటాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్ కాకుండా ఉండవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయను రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్తపోటు నియంత్రణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్రమాదం త‌గ్గుతుంది.

Tags

Next Story