ఒక్క ఇడ్లీ చాలు గురూ.. ఎన్ని లాభాలో తెలుసా?

ఒక్క ఇడ్లీ చాలు గురూ.. ఎన్ని లాభాలో తెలుసా?
ఉదయం లేవగానే అందరూ టిఫిన్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెద్దగా కష్టం లేకుండా సులువగా చేసేందుకు, తినేందుకు, వీలుగా ఉండేది.

ఉదయం లేవగానే అందరూ టిఫిన్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెద్దగా కష్టం లేకుండా సులువగా చేసేందుకు, తినేందుకు, వీలుగా ఉండేది కేవలం ఇడ్లీ మాత్రమే.. చట్నీతో తిన్నా, సాంబార్‌తో తిన్నా, నెయ్యితో తిన్నా, కారప్పొడితో తిన్నా టెస్ట్ మాత్రం అదిరిపోతుంది. కానీ ఇప్పటి యువత ఇడ్లీ అంటే ఇడ్లీనేనా అన్నట్టుగా మొఖం మాడ్చుకుంటున్నారు. కానీ ఇడ్లీ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ప్రతిరోజూ ఇడ్లీనే కావాలని అంటారు.

ఇడ్లీ తినడం వలన అనారోగ్యం తగ్గి, చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. అందుకే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు డాకర్లు ఇడ్లీని తినమని చెబుతుంటారు.


ఇడ్లీ త్వరగా జీర్ణమై పొట్టను కూడా తేలికగా ఉంచుతుంది.


ఇడ్లీలో కార్బొహైడ్రేట్ల దగ్గర నుండి ఫైబర్,ప్రొటీన్ల వరకూ అన్నీ సమృద్దిగా ఉంటాయి.


కేవలం ఒకే ఒక ఇడ్లీ వల్ల 39 కేలరీలు, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, 65 మిల్లీ గ్రాముల సోడియం దొరుకుతుంది.


ఇడ్లీ వాడకంలో ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి.. కొలెస్టరాల్ సమస్య వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా హై బీపీ సమస్య కూడా తగ్గిపోతుంది.ఒక ఇడ్లీలో 1 మిల్లీగ్రాముల ఇనుము, మరియు కాల్షియం, ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ ఎ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story