Health News: కిడ్నీ సమస్యలు.. జీవనశైలిలో మార్పులు

Health News: అనారోగ్యకరమైన జీవనశైలి అన్ని ఆరోగ్య సమస్యలకు మూల కారణం. కిడ్నీ వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి కీలకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిమిత ఉప్పు, పొటాషియం తీసుకోవడం, ధూమపానం మానేయడంతో పాటు శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. కిడ్నీ వ్యాధులు ఐదు దశల్లో సంభవిస్తాయి. అయితే ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే మొదటి, రెండవ దశల్లోనే పూర్తిగా చికిత్స చేయడం సాధ్యమవుతుందని జర్నల్ ఆఫ్ బయోసైన్సెస్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. మూత్రపిండాల పనిచేయకపోవడానికి కారణమయ్యే 6 జన్యు వైవిధ్యాల పనితీరును నియంత్రించడంలో ఆయుర్వేద వైద్యంప్రభావవంతంగా ఉంటుందని సూచించింది.
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని 20-25 మధ్య ఉంచుకోవాలని సూచించారు. వారానికి ఐదు రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామాలు చేయడం, నొప్పిని తగ్గించే మందుల వినియోగాన్ని తగ్గించడం, తగినంత నీటిని తీసుకోవడం, ధూమపానం మానేయడం మొదలైనవి కిడ్నీలను రక్షించడానికి సమర్థవంతమైన మార్గాలు.
ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల కారణంగా ఏటా 1.7 మిలియన్ల మంది మరణిస్తున్నారని అంచనా. భారతదేశంలో, 7.8 మిలియన్ల జనాభా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో జీవిస్తున్నట్లు అంచనా. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు కూడా కిడ్నీ వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com