Tomato Flu: అసలు టమాట ఫ్లూ అంటే ఏంటి..? ఎలా గుర్తించాలి..?

Tomato Flu: ఇప్పటికే కోవిడ్ కొట్టిన దెబ్బ నుండి చాలామంది ప్రజలు, వారి కుటుంబాలు కోలుకోలేదు. ఇంకా దాని ఎఫెక్ట్ మరవకముందే మరెన్నో వైరస్‌లు జనాలపై ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. అసలు ఇలాంటి వైరస్‌లు ఎక్కడ నుండి ఎలా వస్తున్నాయో తెలియకుండా వచ్చి జీవితం ముగిసిపోయేలా చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇటీవల వేగంగా వ్యాప్తి చెందుతున్న టమాట ఫ్లూ.
టమాట ఫ్లూను ముందుగా 2022 మేలో వైధ్యులు గుర్తించారు. దేశంలో తొలి టమాట ఫ్లూ కేసు కేరళలో నమోదయ్యింది. ఆ తర్వాత వెంటవెంటనే దాదాపు 100 మంది పిల్లలకు ఇది సోకింది. ఇప్పటికీ ఈ ఫ్లూ గురించి పూర్తి వివరాలు వైద్యులు తెలుసుకోలేకపోయారు. కానీ ఇది నోటి వ్యాధుల్లో ఒకటి అని అనుమానిస్తున్నారు. మామూలుగా డెంగ్యూ లాంటి జ్వరం అటాక్ అయిన తర్వాత టమాట ఫ్లూ సోకే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వారు చెప్తున్నారు.
టమాట ఫ్లూ ఎక్కువగా ఒకటి నుండి అయిదు సంవత్సరాల వయసున్న పిల్లలలోనే ఎక్కువగా సోకుతుంది. దీని వ్యాప్తి వేగంగా ఉన్నా అంత ప్రమాదకరం కాదని వైద్యులు అంటున్నారు. అంతే కాకుండా చాలావరకు 10 రోజుల్లో ఈ ఫ్లూ నుండి పూర్తిగా కోలుకోవచ్చని.. అప్పటికీ కోలుకోలేకపోతే.. అప్పుడు ఆసుపత్రికి వెళ్లాలని వారు అంటున్నారు.
టమాట ఫ్లూ లక్షణాలు
బొబ్బలు
డీహైడ్రేషన్
చర్మం ఇన్ఫెక్షన్
డయేరియా
వాంతులు
నీరసం అయిపోవడం
ఒళ్లు నొప్పులు జ్వరం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com