HIV: మందుల్లేకుండానే ఎయిడ్స్‌కి చెక్.. !!

HIV (tv5news.in)
HIV: కొన్ని జబ్బులు.. కొన్ని రోగాలు పగవాడికి క్కూడా రాకూడదని కోరుకుంటారు ఆ బాధ అనుభవిస్తున్నవారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి జబ్బులు వచ్చిన రోగుల్ని ఇంట్లోని వ్యక్తులు కూడా దూరంగా పెడుతున్న సందర్భాలు అనేకం. ఏవిధంగా వచ్చినా రాకూడని జబ్బు అది.
దానికి మందు రావడం, రోగులకు కొంత వరకు ఉపశమనం కలగడం.. పరిశోధకుల ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు. ఇప్పటికే అమలులో ఉన్న చికిత్స యాంటీ-రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) హెచ్‌ఐవీ వైరస్ కణాలను నాశనం చేయలేదు కానీ కొత్త కణాలు పుట్టకుండా అడ్డుకుంటుంది.
కానీ ఒకరిద్దరు ఎయిడ్స్ పేషెంట్లలో ఏఆర్‌టీ థెరపీ తీసుకోకుండానే హెచ్‌ఐవీ వైరస్ కణాలు నిర్వీర్యం అవడాన్ని గుర్తించారు పరిశోధకులు. ఇలాంటి వ్యక్తులను 'ఎలైట్ కంట్రోలర్స్' అని పిలుస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టి-కణాలు.. ఔషధాలతో పని లేకుండానే హెచ్‌ఐవీ వైరస్‌ని అణచివేసినట్లు గుర్తించారు. ఇలా ఎయిడ్స్ బారినుండి బయట పడడాన్ని 'స్టెరిలైజింగ్ క్యూర్ ' అని పిలుస్తారు.
గత ఏడాది ఓ ఎయిడ్స్ బాధితురాలు ఈ విధానంలో స్వస్థత పొందినట్లు గుర్తించిన శాన్‌ఫ్రాన్సిస్కో పరిశోధకులు.. తాజాగా మరో వ్యక్తి కూడా ఈ విధానంలో క్యూర్ అయినట్లు ప్రకటించారు. ఎయిడ్స్ నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉన్న ఆ వ్యక్తి నుంచి 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పరీక్షించినా.. ఎక్కడా హెచ్‌ఐవీ వైరస్ జాడ కనిపించలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్‌తో ఎయిడ్స్ క్యూర్.. శాస్త్రవేత్తల ఆశాభావం..
ఎలైట్ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతోందనే విషయాన్ని లోతుగా పరిశోధిస్తున్నారు. ఈ పరిశోధనలు ఫలిస్తే ఎయిడ్స్ వ్యాధికి పరిష్కారం దొరికినట్లే. వారిలో అత్యంత సహజంగా జరుగుతున్న ఈ పధ్ధతిని అనుకరించి. మిగతా వారిని కూడా ఈ వ్యాధి నుండి బయటపడేయొచ్చు.
బాధితుల రోగ నిరోధక వ్యవస్థ మరింత శక్తివంతంగా మార్చే ప్రయత్నాలకు పునాది పడింది. యాంటీ-రిట్రోవైరల్ థెరపీతో సంబంధం లేకుండా, వ్యాక్సినేషన్‌తో ఎయిడ్స్‌పై విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని మసాచూసెట్స్ జనరల్ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు జూయూ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com