BACK PAIN: ఇంట్లోనే నడుము నొప్పికి చెక్..! ఇవి ట్రై చేసి చూడండి..

BACK PAIN: ఇంట్లోనే నడుము నొప్పికి చెక్..! ఇవి ట్రై చేసి చూడండి..
BACK PAIN: అందరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది బ్యాక్ పెయిన్. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి మన ఇంట్లో నుంచే చెక్ పెట్టవచ్చు.

ఆధునిక జీవనశైలితో వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది బ్యాక్ పెయిన్. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా న‌డుము నొప్పి బారిన పడే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పిని తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్లు వాడడం, కాస్త తగ్గగానే నొప్పిని నిర్లక్ష్యం చేయడం చేస్తుంటారు చాలా మంది. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి మరింత పెరిగి సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.

నడుము నొప్పి తరచూ వస్తున్నప్పుడు దానికి తగ్గ ట్రీట్‎మెంట్ తీసుకోవడం ఉత్తమం. ఈ కాలంలో 20 ఏళ్లకే నడుము నొప్పితో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. నడుము నొప్పి తీవ్రంగా వేధిస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి క్లినికల్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి మన ఇంట్లో నుంచే చెక్ పెట్టవచ్చు.

నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. గ్లాసు పాలలో ఓ రెండు, మూడు చెంచాల తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల కూడా నడుము నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఓ గ్లాసు పాలలో కొంచెం గసగసాల పొడిని కలిపి ప్రతిరోజూ ఒకసారి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.


నొప్పి అధికంగా ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న అల్లం ముక్కలను బాగా ర మంచి నీటిలో వేసి వేడిచేయాలి. వడగట్టి చల్లార్చాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేదం డాక్టర్లు చెబుతున్నారు.


ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి. సుదీర్ఘంగా కూర్చోవడం ద్వారా నడుము నొప్పితో పాటు ఊబకాయం(Obesity) లాంటి సమస్యల బారిన పడతారు.

నడుం నొప్పి ఉన్న చోట గోరు వెచ్చటి కొబ్బరి నూనె ను రాసి మర్దన చేసుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసుల నీటిని తీసుకుని బాగా మరిగించాలి. ఈ నీటిలో ఒక క్లాత్ వేసుకొని నడుము నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవాలి. ఇలా ప్రతి పది నిమిషాలకు ఒకసారి చేస్తుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.



ఒక కప్పు నువ్వుల నూనె లో కొద్దిగా నిమ్మ రసం చేసి వేడి చేయాలి. ఇందులో కొద్దిగా కర్పూరం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నడుము నొప్పి ఉన్న చోట చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నడుము నొప్పి తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story