Dandruff treatment: చుండ్రుకు చిటికెలో చెక్.. గన్ షాట్ హోమ్ రెమెడీస్..

Dandruff treatment: చుండ్రుకు చిటికెలో చెక్.. గన్ షాట్ హోమ్ రెమెడీస్..
Dandruff treatment: చుండ్రును త్వరగా నివారించడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.

జుట్టు రాలే సమస్యతో మనలో చాలా మంది బాధ పడుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటోంది. అలాగే జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం తలలో డాన్డ్రఫ్ ఉండడం. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే చుండ్రును చాలా త్వరగా నివారించడానికి కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.


చుండ్రును నివారించడంలో వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వేపాకు‎తో హెయిర్ ప్యాక్ వేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు.. పావు కప్పు వేపాకు రసం, కొబ్బరి పాలు, బీట్ రూట్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె. ఈ పదార్థాలన్నింటినీ ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. అప్లై చేసుకున్న 20 నిముషాల తర్వాత హెర్బల్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేప నూనెను తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేసినా చుండ్రు తగ్గుముఖం పడుతుంది.


డాన్డ్రఫ్ నివారణకు కలబంద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కలబంద దర్శనమిస్తూనే ఉంటుంది. సౌందర్యానికి, ఆరోగ్యానికి అనేక రకాలుగా కలబంద ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద మొక్క నుండి గుజ్జుని నేరుగా తీసి తలకు పట్టించడం బెస్ట్ టిప్ గా చెప్పవచ్చు. ఆతర్వాత షాంపూతో కడిగేస్తే చుండ్రు తాలూకు చికాకు తొలగిపోతుంది. దీన్ని వారానికి ఒకసారి పెట్టినా మంచి ఫలితం కనిపించి.. వెంట్రుకలు కూడా స్మూత్‌గా సిల్కీగా మారతాయి.


మన వంటింట్లో ఉండే నిమ్మకాయ, పెరుగుతో కూడా చుండ్రుని ఈజీగా వదిలించుకోవచ్చు. పెరుగులో విటమిన్ సి, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టుకు ప్రొటీన్‎ని అందిస్తాయి. పెరుగులో ఉండే కాల్షియం తలలో ఉండే చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. పెరుగు, నిమ్మకాయను జుట్టుకి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. దీని కోసం పెరుగు, నిమ్మరసం బాగా కలిపి తలకు పట్టించి కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి. పెరుగు, నిమ్మకాయతో పాటు కొద్దిగా కరివేపాకు జోడిస్తే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

Tags

Read MoreRead Less
Next Story