ఇంటి చిట్కాలతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని ..

మహిళలను వేధించే మొదటి సమస్య రుతుచక్రం క్రమబద్ధంగా రాకపోవడం. సగటు రుతు చక్రం 28 రోజులకు ఒకసారి రావాలి. అయితే ఇది మహిళలందరిలో ఒకే మాదిరి జరగకపోయినా ఒకటి రెండు రోజుల తేడాతో పీరియడ్స్ వస్తుంటాయి. 24 నుంచి 38 రోజులకు ఒకసారి వచ్చినా కూడా రెగ్యులర్‌గానే పరిగణించబడతాయి. అంతకు మించి అయితే అందుకు కారణం ఏమిటో మొదట తెలుసుకోవాల్సి ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి ఇంట్లో ప్రయత్నించే కొన్ని నివారణ మార్గాలు ఉన్నాయి.
1. వివిధ రుతు సమస్యలకు యోగా సమర్ధవంతమైన చికిత్స్గగా ఉపయోగపడుతుంది. 2013లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 35 నుండి 45 నిమిషాలు.. దాదాపు 6 నెలల పాటు యోగా చేస్తే రుతు సంబంధిత హార్మోన్ల స్థాయిని తగ్గించాయని కనుగొన్నారు.
యోగా రుతుస్రావ సమయంలో వచ్చే నొప్పిని, భావోద్వేగ లక్షణాలను తగ్గిస్తుంది. డిస్మెనోరియాతో బాధపడుతున్న మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ప్రాధమిక డిస్మెనోరియాతో బాధపడుతున్న మహిళలు రుతుస్రావానికి ముందు 4,5 రోజులు తీవ్ర నొప్పితో బాధపడుతుంటారు. వీటన్నిటికీ చక్కని పరిష్కారం యోగా చేయడం.
2.అధిక బరువును తగ్గించుకోండి. బరువు అధికంగా ఉన్న మహిళల్లో రుతుస్రావ తేదీల్లో మార్పు జరుగుతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలితో అధిక బరువును నివారించొచ్చు. అయితే వయసుకు తగ్గ బరువు లేకపోయినా రుతు సమస్యలకు కారణమవుతుంది.
3. రోజు వారి వంటల్లో వాడే అల్లం కూడా రుతుసమస్య తీవ్రతను తగ్గిస్తుంది. రుతుస్రావ సమయంలో కలిగే అధిక రక్తస్రావాన్ని నిరోధిస్తుంది. రుతుస్రావం మొదలైన మొదటి 3, 4 రోజులు 750 నుండి 2000 మి.గ్రా అల్లం తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) యొక్క మానసిక స్థితి, శారీరక లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు అల్లం ఉపయోగపడుతుంది.
4. దాల్చిన చెక్క.. వివిధ రకాల రుతు సమస్యలకు దాల్చినచెక్క ప్రయోజనకరంగా కనిపిస్తుంది. 2014లో జరిపిన అధ్యయనంలో ఇది రుతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడింది.
5. 2015 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి ని సక్రమంగా లేనివారు రుతు సమస్యలను ఎదుర్కొంటారు. విటమిన్ డి రుతుస్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది , వీటిలో కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
విటమిన్ డి పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతో సహా కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది. సూర్యరశ్మి నుండి విటమిన్ డి పొందడం ఉత్తమమైన మార్గం. రోజువారీ విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం రుతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్లు PMS ను తగ్గించడానికి రుతు చక్రాలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
6. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు బి విటమిన్లు వైద్యుల సూచనమేరకు వాడుతుంటారు.
బి విటమిన్లు ప్రీమెన్స్ట్రువల్ లక్షణాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. విటమిన్ బి ఆహార పదార్ధాలు తినే మహిళలకు పిఎంఎస్ ( 26 ) ప్రమాదం చాలా తక్కువగా ఉందని 2011 అధ్యయనం తేల్చిచెప్పింది.
7.2013 లో ప్రచురించిన ఒక అధ్యయన ఫలితాలు రోజూ 15 ml ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల రుతుస్రావం సమస్యను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది చేదుగా ఉంటుంది. తినడం కష్టం అనుకుంటే నీటిలో వేసుకుని ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవచ్చు.
8. పైనాపిల్ రుతు సమస్యలను నివారించే ఒక ప్రసిద్ధ ఇంటి నివారణ. ఇది బ్రోమెలైన్ అనే ఎంజైమ్‌ను కలిగి ఉంది, ఇది గర్భాశయం యొక్క పొరను మృదువుగా చేస్తుంది. బ్రోమెలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ పండ్ల ముక్కలను తీసుకుంటే రుతు సమస్యలను నివారించవచ్చు. పైనాపిల్‌లోని ఎంజైమ్ తిమ్మిరి మరియు తలనొప్పి వంటి కొన్ని ప్రీమెన్‌స్ట్రువల్ లక్షణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com