Weight Loss Tip: బరువు తగ్గేందుకు వెల్లుల్లి, తేనె.. ప్రతిరోజు తీసుకుంటే..

Weight Loss Tip: బరువు తగ్గడానికి వెల్లుల్లి, తేనె బాగా పని చేస్తాయని చెబుతున్నారు ఆయుర్వే వైద్యులు. ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. ఇది బరువు తగ్గడంలోనే కాక మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అని వివరిస్తున్నారు.
పెరిగిన బరువు తగ్గడం అంత సులభం కాదు. అయితే చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లు బరువు తగ్గించడంలో తోడ్పడతాయి. ఉదయం పూట అలాగే భోజనానికి ముందు గోరువెచ్చని నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన అల్పాహారం వంటివి వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి చిన్న చిన్న చిట్కాలు, ఇంటి నివారణలు కూడా ఎంతో తోడ్పడతాయి. తేనెలో కలిపిన వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం. తేనె, వెల్లుల్లి కలయిక త్వరగా ఆకలి అనిపించనివ్వదు. దాంతో తినాలన్న ఆకాంక్ష సన్నగిల్లుతుంది.
హైపర్‌టెన్షన్, హై బ్లడ్ ప్రెజర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా పచ్చి వెల్లుల్లిని తీసుకోవచ్చు. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూతో పోరాడుతుంది. జీర్ణవ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
వెల్లుల్లి కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాదు.. ఔషధంగా కూడా ఉపయోగించబడుతోంది. ఇది శక్తివంతమైన యాంటీబయాటిక్ & బ్లడ్ ప్యూరిఫైయర్. ఇది గుండెను రక్షిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడుతుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఆరోగ్యంపై దాని ప్రభావం అద్భుతంగా ఉన్నప్పటికీ వెల్లుల్లి అతిగా తినడం మంచిది కాదు.
వెల్లుల్లి తినడానికి ముందు కొన్ని గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి.. ఆస్తమా రోగులు వెల్లుల్లిని తక్కువగా తీసుకోవాలి. తేనె పోషకమైనది ఫైటో న్యూట్రియెంట్ పవర్‌హౌస్ లాంటిది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి గాయాలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వెల్లుల్లి, తేనె కీళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అయితే బరువు తగ్గడానికి ఈ రెమెడీని ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com