Rasi Phalalu: ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు..

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష రుతువు శ్రావణ మాసం, తిథి బ.చతుర్థశి ఉ. 7.02 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం మఖ సా. 6.34 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం ఉ. 6.20 నుండి 7.58 వరకు, తిరిగి రా. 2.34 నుండి 4.10 వరకు, దుర్ముహుర్తం ప. 12.22 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.49 నుండ 3.40 వరకు, అమృతఘడియలు.. సా. 4.09 నుండి 5.47 వరకు పోలాల అమావాస్య.
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.08
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
ఇక రాశి ఫలాల విషయానికి వస్తే ఏ రాశి వారికి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం..
మేషం: ఆర్థిక ఇబ్బందులు, పనుల్లో జాప్యం, దూరప్రయాణాలు, ఆలయాలు సందర్శన, మిత్రులతో కలహాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం: పనులు ముందుకు సాగవు.. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధన వ్యయం ఎక్కువ.
మిథునం: ప్రముఖులతో పరిచయాలు, వాహనయోగం, ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కర్కాటకం: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. బంధువులతో తగాదాలు, ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పరుస్తాయి.
సింహం: బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక.. వ్యవహారాలలో విజయం, వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కన్య: ఇంటా బయట ఒడిదుడుకులు.. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం, వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్త అందుకుంటారు. వాహనయోగం ప్రాప్తిస్తుంది.
వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండవు.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. ఆకస్మిక ప్రయాణాలు. పనులకు అంతరాయం.
మకరం: సోదరులతో విభేదాలు, ఆర్థిక విషయాలు అంత ఆశాజనకంగా ఉండవు. వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తలెత్తుతాయి.
కుంభం: బంధువులతో సఖ్యత. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.
మీనం: పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com