Antibodies : వారిలో యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?

Antibodies : వారిలో యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?
X
ఇన్ఫెక్షన్ తీవ్రత, బాధితుల వయసు, ఇతర అనారోగ్య సమస్యలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని ఇటలీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు కనీసం 8 నెలల పాటు కొనసాగుతాయట. ఇన్ఫెక్షన్ తీవ్రత, బాధితుల వయసు, ఇతర అనారోగ్య సమస్యలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని ఇటలీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కాగా బాధితుల్లో ఇన్ఫెక్షన్ సోకిన 15 రోజుల్లోగా యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే.. వారిలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు. గత ఏడాది కొవిడ్‌-19 మొదటి ఉద్ధృతి సందర్భంగా మిలాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.

Tags

Next Story