టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి..

టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి..
చిగుళ్ళ వ్యాధి, దంత క్షయం, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి మీ దంతాలకు రక్షణ కల్పిస్తుంది మీ టూత్ బ్రష్.

రోజూ పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్ ఉపయోగిస్తుంటాము. బ్రష్ చేసి స్టాండ్‌లో పెట్టేస్తుంటారు. బాగా అరిగిపోయిన తరువాత మార్చుతుంటారు. కానీ టూత్ బ్రష్‌కి కూడా ఆయుష్షు ఉంటుంది. 3 నెలలకు మించి వాడకపోవడమే మంచిది.

తయారీదారులు, దంతవైద్యుల సిఫారసుల ప్రకారం, మీ టూత్ బ్రష్ ప్రతి 12 నుండి 16 వారాలకు ఒకసారి మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తారు. అలా మార్చకపోతే అది మీ దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మీరు టూత్ బ్రష్‌ను ఎంత తరచుగా మార్చాలి?

చిగుళ్ళ వ్యాధి, దంత క్షయం, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడి మీ దంతాలకు రక్షణ కల్పిస్తుంది మీ టూత్ బ్రష్. మృదువైన బ్రిస్టల్ బ్రష్ మీ దంతాల చుట్టూ ఉన్న ఆహారం మరియు బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది.

రోజుకు రెండుసార్లు 2 నిమిషాల పాటు పళ్ళు తోముకోవడాన్ని దంత వైద్యులు సిఫారసు చేస్తారు. అలా చేయడం ద్వారా క్యావిటీస్ నుంచి రక్షణ కలుగుతుంది. భోజనం చేసిన ప్రతి సారి పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం తొలగించడానికి బ్రష్ చేసుకోవడం ఎంతైనా అవసరం. మధ్యాహ్న భోజనానంతరం వీలు కాకపోతే రాత్రి పూట కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. స్వీట్స్ వంటి చక్కెర పదార్థాలు తిన్న తరువాత తప్పనిసరిగా నోరు పుక్కిలించాలి.

మీ టూత్ బ్రష్‌ను 3 నుండి 4 నెలలకు ఒకసారి మార్చాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సిడిసి) సలహా ఇస్తుంది. మీ కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో ఉంటే, మీ టూత్ బ్రష్‌తో పాటు మీ ఇంటిలోని ప్రతి ఒక్కరి టూత్ బ్రష్‌ను మార్చడం మంచిది.

మీ టూత్ బ్రష్‌ను మరెవరైనా పొరపాటున ఉపయోగిస్తే, దాన్ని శుభ్రంచేసి మళ్లీ మీరు వాడే ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరి నోరు భిన్నమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. మీ టూత్ బ్రష్ ఒక కప్పు లేదా కంటైనర్లో ఇతర టూత్ బ్రష్‌లతో కలిపి ఉంచితే, వాటి హెడ్స్ ఒకదానికొకటి తాకకుండా ఉండేలా చూసుకోండి.

బ్రష్ చేసిన తర్వాత, మీ టూత్ బ్రష్‌ను పంపు నీటితో పూర్తిగా కడగాలి. శుభ్రపరచడానికి మీరు వారానికి ఒకసారి వేడి నీటిని ఉపయోగిస్తే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story