Teenagers: టీనేజ్ పిల్లలతో ఎలా వ్యవహరించాలి.. తల్లిదండ్రులకు నిపుణులు ఇస్తున్న సూచనలు..

Teenagers: టీనేజ్ పిల్లలతో ఎలా వ్యవహరించాలి.. తల్లిదండ్రులకు నిపుణులు ఇస్తున్న సూచనలు..
Teenagers:

Teenagers: యుక్తవయస్సు వచ్చిన పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది ప్రస్తుత న్యూక్లియర్ కుటుంబాల్లో. ఇంతకు ముందు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. ఎంతమంది పిల్లలున్నా ఎలా పెంచాలని అన్న ఆలోచన వచ్చేది కాదు.. ఇప్పుడు ఒకరు, ఇద్దరిని పెంచాలన్నా కత్తి మీద సాములా ఉంటోంది.. అన్నింటికంటే అదే పెద్ద పనిలా ఉంటుందని వాపోతున్నారు చాలా మంది పేరెంట్స్..

అయితే పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా పెద్దవాళ్లు వ్యవహరిస్తే పెద్ధ కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. టీనేజ్ పిల్లలతో వ్యవహరించడం అంటే మీ సహనానికి పరీక్షా సమయం ఆసన్నమైందని గుర్తించాలి. కొన్నిసార్లు మీరు మీ సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించవద్దు అలా వారిని అసంతృప్తికి గురిచేయవద్దు.

వారు మానసికంగా, శారీరకంగా చాలా కఠినమైన సమయాన్ని అనుభవిస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. మీరు ఆ పరిస్థితలును చాలా నైపుణ్యంతో చక్కదిద్దాలి. ఇక్కడే ఎలా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానం..

1. వారి భావాలను మీతో పంచుకోవడానికి వారికి తగినంత సమయం ఇవ్వండి

"మీ కొడుకు లేదా కుమార్తెకు పదహారేళ్లు వచ్చినప్పుడు మీరు వారితో స్నేహితుల్లా వ్యవహరించాలి. వారికి గురువులుగా ఉండకండి. ఏం చేయాలో ఏం చేయకూడదో వారికి చెప్పకండి. వారి మనసులో ఉన్న ఆలోచనలను, సమస్యలను మీతో పంచుకునే అవకాశం వారికి . వారి స్థాయిలో ఉండే స్నేహితుడిగా ఇవ్వండి.

మీరు తల్లిదండ్రులుగా కాకుండా స్నేహితునిగా మీరు వారితో వ్యవహరిస్తే వారి మనసులో ఉన్న భావాలన్నీ మీతో పంచుకుంటారు. అప్పుడు మీకు, వారికి మధ్య ఉన్న అంతరం తగ్గుతుంది. దాంతో వారు మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. తద్వారా అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి.

2. వారితో స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకోండి

తప్పుదారి పట్టిన టీనేజర్ల గురించి వారికి తెలియజేయడం కూడా చాలా ముఖ్యం. మీకు తెలుసా, సూటిగా నడిచే వారి కంటే దారితప్పిన వారే ఎక్కువగా వారి అనుభవ పాఠాలను బోధిస్తుంటారు. మీరు మీ టీనేజ్ పిల్లలకు సున్నితంగా చెప్పండి, 'చూడు.. ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయికి అలాంటి సమస్య వచ్చింది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి.

3. వారిని నిందించకండి, అర్థమయ్యేలా చెప్పండి

ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆవేశంలో తిట్టినా లేదా నిందించినా దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. అలా ఎందుకు ప్రవర్తించాల్పి వచ్చిందో విడమర్చి చెప్పండి.. తరువాత, వారు మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు. వారి కోసం మీరు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు.

4. మీ పిల్లల కోపాన్ని దిగమింగడానికి సిద్ధంగా ఉండండి

పిల్లల కోపాన్ని తల్లి, తండ్రి మరియు ఉపాధ్యాయుడు దిగమింగవలసి ఉంటుంది. అందుకోసం మీరు సిద్ధంగా ఉండాలి. మీ బిడ్డ మీపై చాలా చిరాకుగా ఉన్నప్పటికీ, మీరు దానిని స్వీకరించి, వారికి ఏది మంచిదో అది చేయండి. వారికి నచ్చినది మాత్రమే చేయండి. అప్పుడే వారు మిమ్మల్ని నమ్ముతారు.. మీ సలహాలను స్వీకరిస్తారు.

5. వారి స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించండి

ఈ వయసులు వారు ఎవరితో స్నేహంగా ఉంటున్నారో తెలుసుకోండి.. నిజానికి స్నేహితుల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటారు.. మంచి స్నేహం వారి భవిష్యత్తుని నిర్ధేశిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story