హెల్త్ & లైఫ్ స్టైల్

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌‌తో ఎన్నో లాభాలు.. డైట్‌లో ఎలా చేర్చుకోవాలంటే..

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌ను డైట్‌లో ఎలా చేర్చుకోవాలి, న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌‌తో ఎన్నో లాభాలు.. డైట్‌లో ఎలా చేర్చుకోవాలంటే..
X

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌ను డైట్‌లో ఎలా చేర్చుకోవాలి, న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.

యాపిల్ సైడర్ వెనిగర్ (ACV) ప్రతి వంటగదిలో ఉండవలసిన ప్రధాన వస్తువు. శతాబ్దాలుగా ఇది వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నప్పటికీ, ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క వివిధ ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా మందికి తెలియదు. బరువు తగ్గడానికి సహాయం చేయడంతోపాటు, కొలెస్ట్రాల్‌ నుండి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, మధుమేహం లక్షణాలను మెరుగుపరచడం వరకు అనేక అసంఖ్యాక ప్రయోజనాలు ఉన్నాయి.

మీ రోజువారీ దినచర్యలో యాపిల్ సైడర్ వెనిగర్‌ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఎంత పరిమాణంలో తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య అంశం ప్రతి ఒక్కరూ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోకూడదు. అయితే, ఆపిల్ సైడర్ వెనిగర్ ఎవరు తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. ఆహారంలో ఎలా చేర్చాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. " రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు, మెటబాలిక్ సిండ్రోమ్, అజీర్ణం మరియు అధిక బరువు ఉన్నవారు" తమ ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చేర్చుకోవాలని చెప్పారు.

అయితే దీనిని కొద్ది మొత్తంలో నెమ్మదిగా ప్రారంభించాలని ఆమె సూచిస్తున్నారు. ఇలాంటి వారు"భోజనంతో 5 ml లేదా 1 టీస్పూన్ తీసుకోవడం ద్వారా ప్రారంభించాలి." ఖాళీ కడుపుతో ACV తీసుకోవడం అంత మంచిది కాదు. ఉదయం అల్పాహారంలో 5mlని ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజనం సమయంలో, రాత్రి భోజన సమయంలో లేదా భోజనానికి ముందు ఈ నీటిని సిప్ చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ "జీర్ణాన్ని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇలా అనేక ప్రయోజనాలను పొందేందుకు రోజుకు 15ml సరిపోతుంది." ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్న తర్వాత త్రేన్పులు, కడుపులో మంటగా భావించే వ్యక్తులు ACV పరిమాణాన్ని 5mlకి పరిమితం చేయాలని ఆమె పేర్కొన్నారు.

గమనిక: ఈ కంటెంట్ నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.

Next Story

RELATED STORIES