curry leaves: ఊడుతున్న జుట్టుకు ఉపాయం.. కరివేపాకుతో ఇలా చేస్తే సరి..

curry leaves: ఊడుతున్న జుట్టుకు ఉపాయం.. కరివేపాకుతో ఇలా చేస్తే సరి..
ఈ రోజుల్లో ఎవరి నోట విన్నా జుట్టు బాగా ఊడిపోతోంది.. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

curry leaves: ఈ రోజుల్లో ఎవరి నోట విన్నా జుట్టు బాగా ఊడిపోతోంది.. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తీసుకునే ఆహారం, బయట పొల్యూషన్, జీవన విధానం ఇవన్నీ కూడా జుట్టు ఊడేందుకు కారణమవుతున్నాయి. వంటల్లో మనం రోజూ వాడే కరివేపాకు జుట్టుకు పోషణ ఇస్తుంది, వెంట్రుకలు రాలకుండా చేస్తుంది, చుండ్రును నివారిస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు ఓ 10, 15 లేత కరివేపాకులను పచ్చిగానే తినడం అలవాటు చేసుకుంటే జుట్టు కుదుళ్లు గట్టి పరిచేందుకు కావలసిన పోషకాలు అందుతాయంటున్నారు. ఇలా మీరు డైరెక్ట్‌గా తినలేకపోతే మజ్జిగలో వేసి మిక్సీ చేస్తే మొత్తం కలిసి పోతుంది. అందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర కూడా జోడిస్తే రుచిగానూ ఉంటుంది.

కరివేపాకులో ఉండే మరిన్ని పోషకాల గురించి తెలుసుకుందాం..

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు తలను మాయిశ్చరైజ్ చేస్తాయి, అలాగే డెడ్ హెయిర్ ఫోలికల్స్ ను కూడా తొలగిస్తాయి. అంతే కాకుండా, కరివేపాకు ఆకులు జుట్టుకు మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో బీటా కెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. జుట్టు ప్రోటీన్‌తో తయారు చేయబడినందున జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు కూడా చాలా అవసరం. కరివేపాకులో అమైనో యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచుతుంది.

కరివేపాకు ప్యాక్‌తో జుట్టు పట్టుకుచ్చులా..

అర కప్పు కరివేపాకు, అర కప్పు మెంతి ఆకులను తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే ఒక చెంచా నీటిని ఉపయోగించొచ్చు. ఈ పేస్ట్‌ని తల అంతా అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో తీసుకున్న పదార్థాలు జిడ్డుగా లేనందున, వెంటనే షాంపూ చేయవలసిన అవసరం లేదు.

మరొక మార్గం ఏమిటంటే సుమారుగా 15 నుండి 20 కరివేపాకులను మెత్తగా గ్రైండ్ చేసి రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగుతో కలపాలి. ఈ రెంటిని బాగా మిక్స్ చేసి, ఆపై మీ తలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

ప్రతి వ్యక్తికి రోజకు 50 నుంచి 70 వెంట్రుకలు రాలడం సహజం. ఎవరికైనా, ఇంతకన్నా ఎక్కువ వెంట్రుకలు రాలుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కరివేపాకు సహాయపడుతుంది. ఇది సహజమైనది, ఎటువంటి దుష్ప్రభావాలు లేనిది. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు బలాన్నిఅందించి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇది తలను మాయిశ్చరైజ్ చేస్తుంది.. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, తత్ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

కరివేపాకు ఆయిల్ తయారీ

ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు ఆకులు తీసుకుని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌లో వేసి సన్నని మంట మీద మరిగించాలి.. ఆకులు అన్నీ నల్లగా మారిన తరువాత దించి చల్లారిన తరువాత వడకట్టి రాసుకోవాలి.. ఇలా వారానికి ఒకసారి చేయాలి. తలకు ఆయిల్ పట్టించిన తరువాత వేడి నీటిలో టర్కీ టవల్ ముంచి దాన్ని గట్టిగా పిండి తలకు చుట్టాలి. ఇలా చేయడం వలన వేడి ఆవిరి తలకు అంది జుట్టు కుదుళ్లు గట్టి పడతాయి. వారానికి ఒకసారి ఇలా చేయడం మంచిది.

చుండ్రును వదిలించుకోవడానికి కూడా కరివేపాకును క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. కరివేపాకును, పెరుగుతో కలిపి గ్రైండ్ చేసి పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. పెరుగు తలకు హైడ్రేట్ చేస్తుంది, మృతకణాలను తొలగిస్తుంది. జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. కనీసం వారానికి ఒకసారి ఈ మాస్క్ ఉపయోగించండి.

Tags

Read MoreRead Less
Next Story