Breakfast: బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..!!

Breakfast: బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..!!
Breakfast: ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన అల్పాహారం మీ శరీర శక్తిని పోషకాలు మరియు ఖనిజాలతో నింపే ఇంధనం.

Breakfast: ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన అల్పాహారం మీ శరీర శక్తిని పోషకాలు మరియు ఖనిజాలతో నింపే ఇంధనం. ఇది తిరిగి మీరు మీ పనులలో ఉత్సాహంగా పాల్గొనడానికి తోడ్పడుతుంది. రోజులో మొదటి మీల్‌కి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం.


ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మందికి ఆందోళన కలిగించే మొదటి విషయం.. ఈ రోజు టిఫిన్ ఏం చెయ్యాలి. ఎందుకంటే మీరు నిద్రిస్తున్నప్పుడు సగటున 6-8 గంటల పాటు ఉపవాసం ఉన్న తర్వాత, రోజును సరిగ్గా ప్రారంభించడానికి కావలసిన శక్తి అందేది మీరు తీసుకునే అల్పాహారం ద్వారానే.

అతిగా తినడం : అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతామనుకుంటారు చాలా మంది. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇంకా ఎక్కువగా ఆకలై ఎక్కువ తినేస్తారు. దాంతో మరింత బరువు పెరుగుతారు. పోషకాలతో నిండిన అల్పాహారం కొద్ది మోతాదులో తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.

వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది: ఆరోగ్యకరమైన అల్పాహారం దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి ఇతర జీవనశైలి వ్యాధులకు దారి తీస్తుంది.


మధుమేహం వచ్చే అవకాశం : అల్పాహారం తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు నిరూపించాయి. అల్పాహారం మానేయడంవల్ల టైప్ 2 డయాబెటిస్‌ వస్తుంది. అల్పాహారం మానేయడం వలన మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు పడిపోతాయి.


శక్తి లేకపోవడం: ఆకలితో ఉండడం వలన శక్తి సన్నగిల్లుతుంది. మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్ మరియు ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి ఎల్లప్పుడూ మంచి అల్పాహారం తీసుకోండి. ఇది రోజంతా మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ విధంగా, క్రమం తప్పకుండా సమయానికి అల్పాహారం తినడం అలవాటు చేసుకోవడం ద్వారా, మీరు సరైన పద్ధతిలో మీ జీవక్రియను కూడా పెంచుతారు.


పోషకాల కొరత: మీరు మీ అల్పాహారంలో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పాలిష్ చేయని పప్పులు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, తాజా పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story