stinking feet : వేసవి కాలంలో పాదాల నుంచి దుర్వాసన.. సింపుల్ హోం రెమిడీస్ తో..

stinking feet : వేసవి కాలంలో పాదాల నుంచి దుర్వాసన.. సింపుల్ హోం రెమిడీస్ తో..
stinking feet :అన్నిటి కంటే ముందు పాదాలు వాసన రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి.

stinking feet : వేసవి కాలం వచ్చింది.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. చెమట కూడా ఎక్కువగా పడుతుంది.. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. చెమట రూపంలో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్లిపోతుంది. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చెమట కారణంగా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. ముఖ్యంగా పాదాల నుంచి వచ్చే దుర్వాసన భరించడం మరింత కష్టం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే, మీకు ఉపశమనం కలిగించే ఇంటి నివారణలను గురించి తెలుసుకుందాము. అన్నిటికంటే ముందు పాదాల నుండి వాసనకు కారణం ఏమిటో తెలుసుకోవాలి.

పాదాల వాసనకు కారణం-

* సాక్స్‌లు వేసుకోవడం వల్ల చెమట త్వరగా ఆరిపోదు .

* కాళ్లలో బ్యాక్టీరియా ఉన్నప్పుడు .

* సమ్మర్ లోనే కాదు మీకు మాములుగా చెమటలు పడుతుంటే..

* టైట్ షూస్ వేసుకున్నప్పుడు పాదాలపై ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల కూడా దుర్వాసన వస్తుంది.

నివారణలు:-

ఉప్పునీరు- గోరు వెచ్చని నీటిలో 1-2 టీస్పూన్ల ఉప్పు కలపండి. ఆ తర్వాత అందులో పాదాలను 15-20 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత పాదాలను సాధారణ నీటితో కడిగి ఆరబెట్టండి.

వెనిగర్ - మీరు ధరించే పాదరక్షలలో కొద్దిగా వైట్ వెనిగర్ వేయాలి. నిజానికి ఈ వైట్ వెనిగర్ దుర్వాసనను పీల్చుకుంటుంది.

బేకింగ్ సోడా- దీన్ని ఉపయోగించడం వల్ల పాదాలపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీని కారణంగా, పాదాల నుంచి వచ్చే వాసనతో పాటు వచ్చే ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి కూడా బయటపడొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో 1-2 టీస్పూన్ల బేకింగ్ సోడాను జోడించాలి. ఈ నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి.

రోజ్ వాటర్ - ముందుగా పాదాలను సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు పాదాలపై రోజ్ వాటర్ అప్లై చేయాలి.

నిమ్మకాయ- నిమ్మకాయ ముక్కను తీసుకుని పాదాలపై 5 నిమిషాల పాటు రుద్దండి. తర్వాత సాధారణ నీటితో కడిగి ఆరబెట్టండి.

టాల్కమ్ పౌడర్- బూట్లు ధరించే ముందు సపాదాలపై టాల్కమ్ పౌడర్ చల్లుకోండి.

టీ బ్యాగ్- 1-2 టీ బ్యాగ్‌లను గోరువెచ్చని నీటిలో వేసి అందులో పాదాలను ముంచండి.

ఈ పై చిట్కాల్లో ఏదో ఒకటి ప్రతిరోజు ట్రై చేస్తుంటే పాదాల నుంచి వచ్చే దుర్వాసన దూరమవుతుంది.

Tags

Next Story