Lung Exercises: కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే

Lung Exercises:కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుంది. కరోనా బారిన పడిన వారు ఊపిరి అందక, ఆక్సిజన్ లెవెల్స్ పడి పోయి ఆస్పత్రి పాలవుతున్నారు. ఐసియూలో చికిత్స పొందుతున్నా ఆయుష్షుకి గ్యారంటీ లేకుండా పోయింది. రోజుకి పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.
కొన్ని వ్యాయామాలు ఊపిరితిత్తులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇవి వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
శరీరం పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడికి ఊపిరితిత్తులు పనిచేస్తాయి.
వయస్సు, ధూమపానం, కాలుష్యం వంటి కారణాలతో ఊపిరితిత్తులు తక్కువ సమర్థవంతంగా పనిచేయడానికి కారణమవుతాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) ఉబ్బసం వంటి వ్యాధులకు కారణమవుతాయి.
దీర్ఘకాలిక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ వ్యాయామాలను చేయడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
లిప్ బ్రెత్ (పెదవుల ద్వారా శ్వాస వదలడం)
సుఖాసనంలో కూర్చోవచ్చు లేదా కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోవచ్చు.
ముక్కు ద్వారా బాగా గాలి పీల్చుకుని పెదవులు కొద్దిగా తెరిచి గాలి బయటకు వదలాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయాలి. ఈ వ్యాయామం చేయడం ద్వారా శ్వాస కండరాలు బాగా పనిచేస్తాయి.
అబ్డామినల్ బ్రెత్ (పొట్ట కదలికలను గమనిస్తూ చేసే వ్యాయామం)
అమెరికన్ లంగ్ అసోసియేషన్ నుండి వచ్చిన ఈ వ్యాయామం ఊపిరితిత్తులు విస్తరించే మరియు కుదించే రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వ్యాయామం చేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని వెల్లకిలా పడుకోవాలి.
పొట్టపై ఒక చేతిని ఆనించి ఉంచాలి లేదా తేలికపాటి వస్తువును ఉంచి విశ్రాంతి తీసుకోండి.
ముక్కు ద్వారా నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి. ఇలా గాలి లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట ఎంత పైకి పెరుగుతుందో గమనించండి.
ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుచుకోవడానికి, ప్రతిరోజూ 5-10 నిమిషాలు పొట్ట శ్వాసను మరియు పెదవుల శ్వాసను చేయాల్సి ఉంటుంది.
వ్యాయామం చేసేటప్పుడు ఊపిరిలో ఇబ్బంది తలెత్తితే కాస్త విరామం ఇవ్వాలి.
వ్యాయామాలు ఒక వ్యక్తి యొక్క ఊపిరితిత్తులను వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడంలో సహాయపడతాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు..
ధూమపానం నుండి దూరంగా ఉండాలి
నీరు పుష్కలంగా తాగడం
శారీరకంగా చురుకుగా ఉండటం
ఒక వ్యక్తికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా, రోజువారీ కార్యకలాపాల సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు నొప్పి లేదా దగ్గు రావడం వంటివి ఉంటే, వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com