ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లు.. శీతాకాలంలో రోజూ తీసుకుంటే..

ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లు.. శీతాకాలంలో రోజూ తీసుకుంటే..
శరీరంలో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని..

రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి వైరస్ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సీజన్లో రుచికరమైన పండ్లు విరివిగా లభ్యమవుతాయి. వీటిని పచ్చిగా తినొచ్చు, స్మూతీలో కలపవచ్చు, పచ్చడి చేసుకుని మరింత రుచికరంగా మార్చుకోవచ్చు.

జామకాయ

తీపిగా, రుచికరంగా ఉండే గువా (జామకాయ) ఈ సీజన్‌లో అత్యధికంగా దొరుకుతాయి.. అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

నారింజ

విటమిన్ సి, కాల్షియం నారింజలో అధికంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు కాలానుగుణ అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించగలవు. తాజాగా ఉండే నారింజ పండ్ల రసం రోజూ ఓ గ్లాస్ తీసుకుంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.

యాపిల్స్

రోజుకో యాపిల్ తినడం మంచి ఆలోచన. యాపిల్స్ శరీరంలో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి, కె సమృద్ధిగా ఉన్న యాపిల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తాయని పోషకాహార నిపుణులు భావిస్తారు.
మోసాంబి

మొసాంబి సిట్రస్ కుటుంబానికి చెందిన పండ్లు. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఈ రుచికరమైన పండ్లను కూడా జ్యూస్ తయారీకి ఉపయోగిస్తారు.

దానిమ్మ

దానిమ్మ (లేదా అనార్) ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అనేక రక్షణ ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాక, ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది. బిపి, గుండె, బరువుని తగ్గించడంతో పాటు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. రోజూ ఓ కప్పు గింజలు తినడం లేదా ఓ గ్లాస్ తీసుకుంటే ఆరోగ్యం పదిలం.

Tags

Read MoreRead Less
Next Story