వీపరీతమైన కోపం వస్తుందా..? నిద్రపట్టడం లేదా.? ఇది మీ కోసమే..!

వేళకు తిండి, కంటి నిండ సరిపడా కునుకు ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువై, చాలా మంది సతమవుతున్నారు. నిద్ర లేకపోతే మానసిన సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మనం సరిగ్గా నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. నిద్రపోకపోవడం వల్ల కోపం వీపరీతంగా వస్తుందని అధ్యాయనంలో తేలింది.
ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న 'అమిగ్‌డాలా' అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. యుక్తవయస్కులు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు.
అయితే కొంత మందికి రోజుకి రెండు సార్లు నిద్రపోయే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటోన్నారు. రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమేమీ ఉండబోదని, రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. ఈ కారణంతోనే కొన్ని దేశాల్లో పిల్లలను మధ్యాహ్నం వేళ నిద్రపుచ్చుతారు.
అలాగే ఉద్యోగులకు కూడా నిద్రపోయే అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీలు.
అయితే కొంత మందికి రోజుకి రెండు సార్లు నిద్రపోయే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటోన్నారు. రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమేమీ ఉండబోదని, రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. ఈ కారణంతోనే కొన్ని దేశాల్లో పిల్లలను మధ్యాహ్నం వేళ నిద్రపుచ్చుతారు. అలాగే ఉద్యోగులకు కూడా నిద్రపోయే అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీలు.
కొందరూ రాత్రి సమయంలో ఉద్యోగం చేస్తూ పగలు నిద్రపోతారు. అలాంటి వారు మధ్యాహ్నం వేళ నిద్రపోయిన కుటుంబంతో అన్యోన్యంగా ఉంటున్నారు. నైట్ డ్యూటీల సమయంలో కూడా అలసట లేకుండా పనిచేయగలగుతారని వివరించారు.
ఎంత సేపు నిద్రపోవాలి?
పిల్లల విషయానికొస్తే రోజుకి కనీసం 8 నుంచి 9గంటలైనా నిద్ర అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒకసారి పడుకునేవారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అయితే రెండు సార్లు నిద్రపోయేవారు ఎన్నిగంటలు పడుకోవాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, పరిశోధకులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత పరిశోధనల ప్రకారం.. రెండోసారి కనీసం 40నిమిషాల నుంచి ఒక గంట లోపు నిద్రపోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా సమయానికి నిద్రపోవడం ఎప్పటికీ మంచిదే. అతిగా నిద్రపోయిన అనర్థాలు తప్పవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com