Benefits Of Ajwain Leaves: ఆరోగ్యం, ఔషధం.. వాము ఆకుతో ఎన్నో ప్రయోజనాలు..

Benefits Of Ajwain Leaves: వంటింటి ఔషధం వాము. కాస్త కడుపు ఉబ్బరంగా అనిపిస్తే వాముని నీళ్లలో మరగబెట్టి ఆ నీటిని గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది అని పెద్దవాళ్లు చెబుతుంటారు. పిండి వంటలు ముఖ్యంగా జంతికలు వంటి తెలుగింటి వంటల్లో వాము కచ్చితంగా పడాల్సిందే. వాము ఎంత ప్రయోజనాకరో అంతే ఉపయోగాలు ఉంటాయి వాము ఆకుల్లో కూడా.
ఈ సుగంధ విత్తనాలను అనేక దేశీ పానీయాలు, కూరలు, పరాటాల వంటి రొట్టెల తయారీలో కూడా రుచి కోసం జోడిస్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అద్భుత ఔషధం. ఆయుర్వేదంలో వాముకు ప్రముఖ స్థానం ఉంది. ఇంట్లో లేదా మీ కిచెన్ గార్డెన్‌లో ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. ఆకులు అనేక ఉపయోగాలను కలిగి ఉంటాయి. అజ్వైన్ ఆకులను క్రింది విధంగా ఉపయోగించవచ్చు.
జలుబు, దగ్గు ఉంటే, 10 లేదా 12 ఆకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రం చేసి ఒక గ్లాసు నీరు పోసి తక్కువ మంటపై మరిగించాలి. ఆ నీరు మూడు వంతుల తగ్గేంత వరకు మరగనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కావాలంటే, దానికి కొద్దిగా తేనె కూడా జత చేయవచ్చు.
అజ్వైన్ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ అద్భుతమైన ఆకులను రోజువారీ వినియోగించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com