Covid Fact Check: టాయిలెట్ ఫ్లషింగ్ ద్వారా కరోనా..!!

Covid Fact Check: మొత్తం వైరస్ కణాల సంఖ్యలో 40 నుండి 60 శాతం మరుగుదొడ్డి సీటు పైన పెరగడం వల్ల ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
కరోనావైరస్ టాయిలెట్ ఫ్లషింగ్ ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. ఇటీవల, 'ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం,
టాయిలెట్ కమోడ్ ఫ్లష్ చేయడం ద్వారా పైకి వేగంగా ఏరోసోల్ కణాలు బౌల్ నుండి బయటకు వెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. మొత్తం కణాల సంఖ్యలో 40 నుండి 60 శాతం టాయిలెట్ సీటు పైన పెరగడం వల్ల ఇవి వ్యాప్తి చెందుతాయని అధ్యయనం పేర్కొంది.
అందువలన ఇంట్లో ఎవరైనా కరోనా బారిన పడితే వారు వాడుతున్న బాత్ రూమ్ వాడక తప్పని పరిస్థితి అయితే వెంటనే వేడి నీళ్లు టాయిలెట్ లో పోయడం, బాత్ రూమ్ కూడా వేడినీటితో కడగడం వంటివి చేయాలి.
బ్రష్ చేసుకున్నప్పుడు వేడి నీటిని ఉపయోగించడం, సింక్ లో కూడా వేడినీళ్లు పోయడం వంటివి చేయాలి. టాయిలెట్ వాడిన వెంటనే పైన మూతతో కవర్ చేయాలి. వాడిప తరువాత కూడా మూత పెట్టే ఫ్లష్ చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com