Water: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు..

Water: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు..
Water: మనిషికి నీరు చాలా అవసరం.. సరిపడనంత నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అదే మాదిరిగా ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీయవచ్చు.

water: మనిషికి నీరు చాలా అవసరం.. సరిపడనంత నీరు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అదే మాదిరిగా ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీయవచ్చు. ఇది మీ శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు.అయితే ఏదైనా అతిగా చేయకూడదు.. అది ప్రాణాపాయం కావచ్చు. అతిగా నీరు తాగితే కడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

ఇది ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది. మూత్రపిండాలు శరీరంలోని ద్రవాన్ని ప్రాసెస్ చేయలేకపోతే ఆ ద్రవం అవయవాలలో ఉండి వాటిని ఉబ్బేలా చేస్తుంది. అది మెదడు పనితీరుకు, మూత్ర పిండాల సమస్యలకు అంతరాయం కలిగిస్తుంది. గుండెపై ఒత్తిడి పడుతుంది. సోడియం వంటి ముఖ్యమైన లవణాలు ఎక్కువ నీరు తీసుకుంటే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

నీరు ఎక్కువగా వినియోగిస్తున్నారు అనేదానికి సంకేతం..

తరచుగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక

మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గించడానికి వాంతులు అవుతుంటాయి.

మూత్రపిండాలపై ఓవర్లోడ్ కారణంగా అలసట

సోడియం అసమతుల్యత కారణంగా కండరాలు బలహీనమవుతాయి. దాంతో తిమ్మిరిలను అనుభవించాల్సి వస్తుంది.

మీరు ఈ లక్షణాలలో ఏవైనా కొన్నింటిని ఎదుర్కొంటున్నట్లయితే ఎంత నీటిని తీసుంటున్నారు అనేదానిపై దృష్టి పెట్టాలి.

కాబట్టి, మీరు ఎంత నీరు త్రాగాలి?

US నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం..

పురుషులు - రోజుకు 3.7 లీటర్లు

స్త్రీలు - రోజుకు 2.7 లీటర్లు

కానీ, వయస్సు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా మార్చవలసి ఉంటుంది:

స్త్రీలు గర్భధారణ సమయంలో బిడ్డ పుట్టినప్పుడు చనుబాలివ్వడానికి అవసరమైన అదనపు ద్రవాన్ని చేర్చడం కోసం నీటిని తీసుకోవడం పెంచాలి. వేడి వాతావరణంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల ఎక్కువ నీరు అవసరమవుతుంది. పని ఒత్తిడి సమయంలో కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడానికి నీరు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం సమయంలో కూడా నీటిని సిప్ చేస్తుండాలి.

జ్వరం, మరియు వాంతులు వంటి ఆరోగ్య పరిస్థితులు - నీరు తీసుకోవడం పెంచాలి. నిజానికి దాహం అవుతోంది.. నీరు తాగాలి అనే సంకేతాలను శరీరం ఇస్తుంది. దాహం వేసినప్పుడు నీరు త్రాగండి. మూత్రం యొక్క రంగు ముదురు పసుపు రంగులో ఉంటే నీరు సరిపడనంత తీసుకోవట్లేదని అర్థం. అలా

అయితే, మీ నీటి తీసుకోవడం రెండు గ్లాసులు పెంచడానికి ప్రయత్నించండి. నోటి దుర్వాసన కూడా మీరు తగినంత నీరు తాగడం లేదని సూచిస్తుంది. నీటి తీసుకోవడం గురించి మీకు గుర్తు చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడం మంచి ఆలోచన. వాచ్/మొబైల్‌లో రిమైండర్‌లను ఉపయోగించడం కూడా బిజీ ప్రొఫెషనల్స్‌కు మంచిది.

Tags

Read MoreRead Less
Next Story