ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మంచిదా కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మంచిదా కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
అమ్మ ఇంట్లో టిఫిన్ ఏమీ చేయకపోతే.. ఓ రెండు బ్రెడ్ పీసులు తినేసి బ్రేక్ ఫాస్ట్ అయిపోందని అనిపించవచ్చు.

అమ్మ ఇంట్లో టిఫిన్ ఏమీ చేయకపోతే.. ఓ రెండు బ్రెడ్ పీసులు తినేసి బ్రేక్ ఫాస్ట్ అయిపోందని అనిపించవచ్చు. ప్రతి ఇంట్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన అల్పాహారం బ్రెడ్. మరి నిపుణులు ఏం చెబుతున్నారు. బ్రెడ్ శక్తికి మంచి మూలం. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు శక్తిని అందిస్తుంది. అయితే, బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువగా ఉంటాయి.

అయితే ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మంచిది కాదు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిద్రలేచిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఆహారం తినకూడదు. ముంబైలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని డైటీషియన్ డాక్టర్ జినాల్ పటేల్ ఖాళీ కడుపుతో బ్రెడ్ ఎందుకు తినకూడదో వివరించారు.

మీరు తినే రొట్టె ఏ రకానికి చెందినదో ముందు తెలుసుకోవాలి. వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలు ఆకలిని పెంచుతాయి. అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తాయి.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. తద్వారా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. బ్రెడ్‌లో ఉండే సాధారణ పిండి పదార్థాలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ప్రేగు కదలికలు బాధాకరంగా ఉంటాయి. కాబట్టి, ఉదయాన్నే తినకుండా ముందుగా ఏదైనా తేలికగా ఉండే ఆహారం తీసుకోండి. ఆపై మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో గోధుమ రొట్టెను తీసుకోవచ్చు.

ఇది ఉబ్బరం కలిగిస్తుంది. వైట్ బ్రెడ్‌లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది మీకు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. ఉదయం పూట ఎంత మోతాదులో బ్రెడ్ తింటున్నారో చూసుకోవడం మంచిది. దానికంటే ముందు పండ్లు తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది.

Tags

Read MoreRead Less
Next Story