Health News: నిద్రించేముందు నీళ్లు తాగడం మంచిదేనా.. నిపుణులేం చెబుతున్నారు..

Health News: నిద్రించేముందు నీళ్లు తాగడం మంచిదేనా.. నిపుణులేం చెబుతున్నారు..
Health News: పడుకునే ముందు పక్కనే నీళ్లు పెట్టుకుని పడుకోవడం.. నిద్ర మధ్యలో దాహం వేస్తే తాగడం దాదాపు అందరికీ అలవాటు ఉన్న ప్రక్రియ. పడుకునే ముందు కూడా ఓ పెద్ద గ్లాస్ నీళ్లు తాగుతుంటారు.

Health News: పడుకునే ముందు పక్కనే నీళ్లు పెట్టుకుని పడుకోవడం.. నిద్ర మధ్యలో దాహం వేస్తే తాగడం దాదాపు అందరికీ అలవాటు ఉన్న ప్రక్రియ. పడుకునే ముందు కూడా ఓ పెద్ద గ్లాస్ నీళ్లు తాగుతుంటారు.

స్లీప్ డిజార్డర్ స్పెషలిస్టులు మీరు పడుకునే ముందు ఎంత నీరు త్రాగుతున్నారో గుర్తుంచుకోవాలి అని వివరిస్తున్నారు. "సాధారణంగా, నిద్రవేళకు ముందు ఎక్కువ మొత్తంలో నీరు త్రాగాలని మేము సిఫార్సు చేయము, మరీ గొంతు ఎండిపోకుండా ఉండేందుకు చాలా తక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం మంచిదని" డాక్టర్లు వివరిస్తున్నారు.

నిద్రించడానికి ఎన్ని గంటల ముందు నీరు తాగాలి..

మీరు పడుకునే ముందు రెండు గంటల ముందు నీరు త్రాగటం మానేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. బెడ్ ఎక్కేముందు ఒకసారి వాష్‌రూమ్‌కి వెళితే మళ్లీ మధ్యలో మెలకువ రాకుండా ఉంటుంది. దాంతో స్లీప్ డిస్ట్రబెన్స్ ఉండదు అని వివరిస్తున్నారు.

మీ నోరు ఎండిపోయినట్లు అనిపించినా లేదా మీరు రాత్రిపూట మందులు వేసుకోవాల్సిన అవసరం వచ్చినా - కొంచెం నీరు ఫర్వాలేదు.

"సాధారణంగా నిద్రవేళకు ముందు చివరి రెండు గంటలలో ఒక గ్లాసు కంటే తక్కువ నీరు త్రాగాలి.

పడుకునే ముందు నీళ్లు తాగడం ఎందుకు మానేయాలి?

హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం అయితే, రాత్రి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే కీలకం. నీరు ఎక్కువగా తాగితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. దాంతో ఉదయం లేచేసరికి అలసట, నీరసం ఆవహిస్తుంది.

నిద్ర లేమి రోగనిరోధక వ్యవస్థను నిరోధిస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పలు రకాల సమస్యలు చుట్టుముడతాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అంటువ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుట, క్యాన్సర్ వంటి వ్యాధులు చుట్టుముడతాయి.

తరచుగా మూత్రవిసర్జనకు కారణమయ్యే పరిస్థితులు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. అలా అయితే, మీరు పడుకునే ముందు నీటిని తీసుకోవడం తగ్గించుకోవాలి.

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?

మితంగా నీరు త్రాగటం ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, కీళ్లను లూబ్రికేట్ చేయడం, వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం వంటి ప్రయోజనాలు నీరు తాగడం వలన కలుగుతాయి.

మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వేడి వాతావరణంలో ఉన్నట్లయితే, పడుకునే ముందు తాగిన కొంచెం నీరు మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రయోజనకరంగా ఉంటుంది.

పడుకునే ముందు నీరు ఎప్పుడు త్రాగాలి?

రోజులో ఎప్పుడైనా నీళ్లు తాగొచ్చు. కానీ నిద్రించే ముందు కాదు.

ద్రవపదార్థాల సమతుల్యతను పాటించండి:

ప్రతి భోజనంతో పాటు నీరు త్రాగుట.

వ్యాయామం చేసిన తర్వాత హైడ్రేటెడ్ గా ఉండటం.

పండ్లు మరియు కూరగాయల నుండి అదనపు నీటిని పొందడం.

ద్రవ పదార్ధాలు తీసుకోవడానికి రోజులో నిర్దిష్ట సమయం అంటూ ఏదీ లేదు. ఒక్క నిద్రించేముందు తప్ప. ఆ సమయంలో కూడా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. దాహం వేస్తున్నా తాగకుండా నిద్రించకూడదు.. అలా చేస్తే నిద్ర కూడా పట్టదు.

Tags

Read MoreRead Less
Next Story