సంతానభాగ్యం సఫలీకృతం.. ఐవీఎఫ్ అత్యాధునికంగా..

సంతానభాగ్యం సఫలీకృతం.. ఐవీఎఫ్ అత్యాధునికంగా..
పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదని చింతించే వారి కోసం ఐవీఎఫ్ ఓ ఆశా కిరణం.

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదని చింతించే వారి కోసం ఐవీఎఫ్ ఓ ఆశా కిరణం. భాగస్వామి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించి పిండం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటారు. ఈ ప్రక్రియలో వీర్యకణాల చలనం చురుగ్గా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం పెంటోక్జ్సైఫైలిన్ అనే ఏజెంట్‌ను వాడుతున్నారు.

అయితే దీనికంటే ప్రభావవంతంగా పని చేసి, దుష్ప్రభావాలు చూపని మాలిక్యూల్‌ను ఐఐటీ హైదరాబాద్, మణిపాల్‌లోని కస్తూర్భా వైద్య కళాశాల, మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. దీనిని 'ఎంపీటీఎఫ్' గా పిలుస్తున్నారు.

పెంటోక్జ్సైఫైలిన్ నుంచే వీరు దీనిని రూపొందించారు. ఈ ఫలితాలు ఇటీవలే నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు ఆచార్య బీఎస్‌మూర్తి మాట్లాడుతూ.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి చేస్తున్న పరిశోధనలు మంచి ఫలితాలనిస్తున్నాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story