మధుమేహ రోగులు ఈ పండు తింటే ఏమవుతుంది..?

పనస పండు చూడటానికి ఎంత వికారంగా ఉన్నా ఒక్కసారైనా తినితిరాలనిపిస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పనస పండు రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. కరోనా వంటి సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస పండు తొక్కతినండి. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అయితే, ఈ పండును మధుమేహ రోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.
పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది. పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జేమ్స్ జోసఫ్ అధ్యాయనంలో ఈ పండు షూగర్ పేషంట్స్ తినొచ్చని తేలింది. షూగర్ నియంత్రణలో జాక్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తేలింది.ఈ పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి.. మధుమేహం రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహ రోగులు ఈ పండు తిన్నా ఎలాంటి సమస్యల ఉండవు.
పనసతో ప్రయోజనాలు
*పనసలో ఉండే పొటాషియం మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రిస్తుంది.
*ఈ పండులో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-C, పనసలో విటమిన్-A పుష్కలంగా ఉంటాయి.
*ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది.
*పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.
*పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఉన్నాయి.
*పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనత నివారిస్తుంది.
*వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com