Liver Care: కాలేయ పనితీరును మెరుగుపరిచే 7 శక్తివంతమైన ఇంటి నివారణలు..

Liver Care: కాలేయ పనితీరును మెరుగుపరిచే 7 శక్తివంతమైన ఇంటి నివారణలు..
Liver Care: ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం వారి శరీర స్పందనలపై ఆధారపడి ఉంటుంది. కాలేయం బాడీలో అతి ముఖ్యమైన అవయవం. నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.

Liver Care: ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం వారి శరీర స్పందనలపై ఆధారపడి ఉంటుంది. కాలేయం బాడీలో అతి ముఖ్యమైన అవయవం. నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. దాని అనేక విధులు మన రక్తప్రవాహం నుండి విషాన్ని ఫిల్టర్ చేయడం, స్థూల- మరియు సూక్ష్మపోషకాలను సమతుల్యం చేయడం, హార్మోన్లను నియంత్రించడం. కాబట్టి కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, కాలేయానికి అనుకూలమైన ఆహారం తీసుకోవడం మీ కాలేయాన్ని సురక్షితంగా ఉంచడానికి, బాగా పనిచేయడానికి మరియు కాలేయ వ్యాధిని నివారించడానికి ఉత్తమ వ్యూహం.

మీ కాలేయాన్ని సహజంగా డిటాక్స్ చేయడానికి 7 శక్తివంతమైన ఇంటి నివారణలు:

నిద్ర లేవగానే ముందుగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగండి.

కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి, బరువు తగ్గడానికి ప్రతిరోజూ కనీసం 6-8 గ్లాసుల ఫిల్టర్ చేసిన నీరు త్రాగాలి.

మీ ఆహారంలో కనీసం 40% పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరంలో విషాన్ని తొలగించే కాలేయ సామర్థ్యాన్ని పెంచుతాయి.

చక్కెర, మైదాతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది కాలేయం చాలా కష్టపడి పనిచేయడానికి కారణమవుతుంది. ప్రతికూల బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది.

మునగ, మట్కీ, నల్ల చన్నా, పచ్చి చన్నా మరియు మొలకెత్తిన గోధుమలు వంటి మొలకెత్తిన పప్పులను తినండి. కాలేయాన్ని శుభ్రపరిచే లక్షణాలను మెరుగు పరుస్తాయి.

రోజూ ఒక గ్లాసు క్యారెట్ + బీట్‌రూట్ + పాలకూర రసం లేదా ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం త్రాగాలి. ఇవి శక్తివంతమైన లివర్ క్లెన్సర్లు.

పాలు, మాంసాహర వంటలు, ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story