Omicron Symptoms: బాడీ పెయిన్స్, ఒళ్లంతా చెమటలు.. ఒమిక్రాన్ లక్షణాలు..!!

Omicron Symptoms: బాడీ పెయిన్స్, ఒళ్లంతా చెమటలు.. ఒమిక్రాన్ లక్షణాలు..!!
X
Omicron Symptoms: ఒమిక్రాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తీవ్రమైన అనారోగ్య లక్షణాలు బయటకు రాలేదు.

Omicron Symptoms: ప్రతి కొత్త వేరియంట్ తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతానికి కొత్త వేరియంట్ 63 దేశాల్లో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం డెల్టా వేరియంట్‌ను అధిగమించడానికి అవకాశం ఉంది. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఈ వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉంటుందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది.

ఒమిక్రాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తీవ్రమైన అనారోగ్య లక్షణాలు బయటకు రాలేదు. ఒమిక్రాన్ అంటువ్యాధే కానీ దాని లక్షణాలు తేలికగా ఉంటాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు.

కోవిడ్ వేరియంట్ యొక్క కొత్త లక్షణం బాడీ పెయిన్స్. దక్షిణాఫ్రికా వైద్యుడు అన్‌బెన్ పిళ్లే ప్రకారం రాత్రిపూట చెమటలు కూడా అధికంగా పట్టడం కూడా ఓ లక్షణంగా చెప్పారు.

తేలికపాటి జ్వరంతో పాటు, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, రాత్రి చెమటలు ఓమిక్రాన్ వేరియంట్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు.

కరోనా సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. కొత్త వేరియంట్ తేలికపాటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిపుణులు చెప్పినప్పటికీ, కొత్త నివేదికలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం వ్యాక్సినేషన్ వేయించుకోవడం. రెండు డోసులు తీసుకున్నవారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ కోసం ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి.

Tags

Next Story